వికారాబాద్ ఘటన..కొనసాగుతున్న అరెస్టులు..!

Vikarabad incident..ongoing arrests..!

వికారాబాద్ : లగచర్ల కలెక్టర్‌, అధికారుల పై దాడి ఘటనలో ఇంకా అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో అనేక మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా మరికొందరిని కూడా అరెస్ట్ చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని కొడంగల్ పోలీస్‌స్టేషన్‌ నుంచి పరిగి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. వీరందరినీ సాయంత్రం వరకు రిమాండ్ చేసే అవకాశం ఉంది. అలాగే ఈ కేసులో మరికొందరి కోసం కూడా పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

కాగా.. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం పరిధిలోని దుద్యాల మండలం, లగచర్ల గ్రామంలో ఫార్మా ఇండస్ట్రియల్‌ కారిడార్‌ (క్లస్టర్‌) ఏర్పాటుకు భూసేకరణలో భాగంగా ఈనెల 11న ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌, తాండూరు సబ్‌-కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, తహసీల్దార్‌ విజయకుమార్‌, వికారాబాద్‌ డీఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డిపై రైతులు, గ్రామస్థులు రాళ్లు, కర్రలతో దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సీరియస్‌ తీసుకున్న పోలీసులు.. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు.. లగచర్ల దాడిలో పోలీసులు మొత్తం 47 మంది నిందితులను గుర్తించగా.. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, మరో 21 మందిని రిమాండ్‌ చేశారు.

దాడిలో కీలకంగా వ్యవహరించిన సురేశ్‌రాజ్‌, దేవదాస్‌, గోపాల్‌నాయక్‌, విజయ్‌, విఠల్‌ పరారీలో ఉన్నారు. వీరిని అరెస్టు చేసేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. అరెస్ట్‌ల నేపథ్యంలో ఆ మూడు గ్రామాల్లో నిశబ్ధ వాతావరణం చోటు చేసుకుంది. ఈ దాడిలో సురేష్ ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సురేశ్‌ బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడని, దాడికి ముందు.. ఆ తర్వాత కూడా అతడి ఫోన్‌ నుంచి కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో 42 సార్లు మాట్లాడినట్లు కాల్‌డేటా రికార్డ్‌ (సీడీఆర్‌) ద్వారా గుర్తించారు. సురేశ్‌ తనకు ఫోన్‌ చేసిన విషయం వాస్తవమేనని, భూసేకరణకు వచ్చిన అధికారులతో శాంతంగా మాట్లాడాలని సూచించినట్లు నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పట్నం నరేందర్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Life und business coaching in wien – tobias judmaier, msc. Græs kan være meget nærende, men for overvægtige heste kan det indeholde for meget sukker og kalorier. Does the import and export business make enough profit ? biznesnetwork.