నేడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan is going to campaign for Maharashtra elections today

అమరావతి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు(శనివారం) మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు కూటమి అభ్యర్థులకు మద్దతుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తారు. జనసేనాని పవన్ కళ్యాణ్ నేటి నుంచి రెండురోజుల పాటు మహారాష్ట్రలో రెండు రోడ్ షోలు, ఐదు బహిరంగ సభల్లో పాల్గొంటారు. అయితే మొదటి రోజు పర్యటనలో భాగంగా ఇవాళ(శనివారం) మరట్వాడ, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

అనంతరం అదే జిల్లాలోని భోకర్ నియోజకవర్గానికి వెళ్తారు. అక్కడ నిర్వహించే సభలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 2 గం.కు లాతూర్ చేరుకుంటారు. అక్కడ నిర్వహించే సభలో పాల్గొంటారు. రాత్రి 6గం.కు షోలాపూర్ నగరంలో రోడ్ షోలో పాల్గొంటారు. రేపు(17వ తేదీ) విదర్భ ప్రాంతానికి వెళ్తారు. ఆదివారం ఉదయం చంద్రపూర్ జిల్లాలోని బల్లార్ పూర్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం పుణె కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో రోడ్ షో లో పాల్గొంటారు. అనంతరం కస్బా పేట్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఇదిలా ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు కూడా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Business leadership biznesnetwork. Clínicas de recuperação para dependentes químicos e alcoólatras. 禁!.