పుష్ప-2 వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్‌కి రెడీ

pushpa 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పుష్ప 2’ గ్లోబల్‌గా డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ సుకుమార్ తన ప్రత్యేకమైన స్టైల్‌తో సినిమాను తెరకెక్కించడంతో, ఇది పుష్ప సిరీస్ అభిమానుల్లో మరింత ఉత్సాహం రేకెత్తించింది. తాజాగా నవంబర్ 17న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు, దాంతో సినిమా మీద హైప్ మరింత పెరిగింది.

ఈ ట్రైలర్ లాంచ్‌ను బీహార్‌లోని పాట్నాలో భారీగా నిర్వహించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ట్రైలర్ విషయంలో కూడా ఆసక్తికరమైన వివరాలు తెలియజేశారు. ఇది పూర్తిగా అభిమానులను ఉర్రూతలూగించేలా ఉండనుందని, 2 నిమిషాల 44 సెకన్ల నిడివితో ప్రేక్షకులకు ప్యూర్ మ్యాడ్‌నెస్‌ను చూపించబోతున్నట్లు వెల్లడించారు. అభిమానులు ఊహించిన దానికంటే ఎక్కువ ఫైర్‌తో ఈ ట్రైలర్ ఆకట్టుకుంటుందని చిత్రబృందం అంటోంది.

రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ తన మాసివ్ పర్ఫార్మెన్స్‌తో మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోనున్నాడు. పుష్ప రాజ్ పాత్రలో బన్నీ కొత్త కోణాలను తెరపై చూపించనుండటంతో అభిమానులు సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Review and adjust your retirement plan regularly—at least once a year. Construindo uma vida equilibrada após o tratamento : clínica de recuperação liberdade e vida para dependentes químicos. 『?.