తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు మహిళలకు ఆహ్వానం – సీఎం రేవంత్

dec 09 telugu talli

కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఘనంగా విజయోత్సవాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. గురువారం విజయోత్సవాలఫై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని , ముఖ్యంగా మహిళా సాధికారత, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన పనులను వివరించాలని అధికారులకు , నేతలకు తెలిపారు. అలాగే విజయోత్సవాల్లో భాగంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ సభల్లో సీఎం రేవంత్ పాల్గొనబోతున్నారు.

నవంబర్ 19న వరంగల్ వేదికగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్, సెక్రెటేరియట్, నెక్లెస్ రోడ్ పరిసరాల్లో విజయోత్సవాలు జరపాలని పేర్కొన్నారు. అలాగే అన్ని నియోజకవర్గాల వారీగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఇక డిసెంబర్ 9న సెక్రెటరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్నారు. దీనికి రాష్ట్రవ్యాప్తంగా మహిళలను ఆహ్వానించాలని సీఎం నిర్ణయించారు. ప్రభుత్వం మొదటి ఏడాదిలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలను శాఖలవారీగా ప్రజలకు వివరించాలని అధికారులకు సీఎం సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Latest sport news. 用規?.