తమిళ సూపర్ స్టార్ సూర్య నటించిన “కంగువ” మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలై మంచి స్పందనను పొందుతోంది. బాలీవుడ్ నుంచి బాబీ డియోల్, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటించగా, కార్తీ గెస్ట్ రోల్‌లో కనిపించారు. ఈ సినిమాకు దర్శకుడు శివ మార్గదర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్ మరియు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా ఉన్నారు. నవంబర్ 14న విడుదలైన ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, కలెక్షన్ల వివరాలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.”కంగువ” సినిమాను పిరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో, భిన్నమైన కథాంశంతో అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖులు, భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన టాప్ టెక్నీషియన్స్ పనిచేయడంతో సినిమా బడ్జెట్ సుమారు 350 కోట్లకు చేరుకుంది.
ప్రమోషన్ల ఖర్చులు అదనంగా 50 కోట్ల వరకు ఉండగా, మొత్తం 400 కోట్ల బడ్జెట్‌తో ఈ భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా “కంగువ” మూవీకి అత్యద్భుతమైన స్పందన లభించింది. థియేట్రికల్ హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడవ్వగా, తమిళనాడు రైట్స్ 80 కోట్లకు, తెలుగు రైట్స్ 25 కోట్లకు, కర్ణాటక రైట్స్ 10 కోట్లకు, కేరళ రైట్స్ 10 కోట్లకు అమ్ముడయ్యాయి. అలాగే హిందీ మరియు ఇతర భాషల్లో 25 కోట్లు, ఓవర్సీస్ హక్కులు 40 కోట్ల రూపాయలకు విక్రయించడంతో, మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ 190 కోట్లకు చేరుకుంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా 195 కోట్ల షేర్ లేదా 390 కోట్ల గ్రాస్ వసూళ్లను లక్ష్యంగా పెట్టుకుని విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది.