మీ బ్రతుకంతా కుట్రలే- జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

jaggareddycomments

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే , కాంగ్రెస్ కీలక నేత జగ్గారెడ్డి..బిఆర్ఎస్ పార్టీ పై కీలక వ్యాఖ్యలు చేసారు. మీ పరిపాలనలో ఏమేమి పాపాలు చేశారో, మీ బ్రతుకంతా కుట్రలమయం..తెలంగాణ అభివృద్ధికి ఆటంకం మీరు. మీకు అభివృద్ధి చేయడం చేతకాదు.. చేస్తుంటే సహించలేరు అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

గురువారం హైదరాబాద్ లోని పీసీసీ కార్యాలయంలో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బలవంతంగా రైతుల భూములను లాక్కున్న విషయాన్ని కేటీఆర్ మరిచిపోయారని.. బీఆర్ఎస్ పావలా పనిచేసి రూపాయి పబ్లిసిటీ చేసుకోవడంలో నిత్యం ముందుంటుందని పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం హయాంలో రైతుల అభిప్రాయ సేకరణకై గ్రామ సభలు నిర్వహిస్తున్నామని, బీఆర్ఎస్ మాత్రం అందుకు భిన్నంగా బలవంతంగా రైతుల భూములను లాక్కున్నట్లు విమర్శించారు. కొడంగల్ ప్రాంతం అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి పరిశ్రమలు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని, ఆ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తుందన్నారు. అధికారం పోయిందన్న అక్కసుతో బీఆర్ఎస్ కుట్రలు పన్నుతుందని, ప్రజలు ధర్నాలు కూడా చేయకుండా ధర్నా చౌక్ ను ఎత్తేసిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందన్నారు. తెలంగాణను దోచుకున్న దొంగల ముఠాగా బీఆర్ఎస్ పార్టీ అన్నారు. తాము రూపాయి పనిచేసి పావలా పబ్లిసిటీ కూడా చేసుకోలేకపోతున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నాన్ని కేటీఆర్ ఇప్పటికైనా మానుకోవాలని, తెలంగాణ అభివృద్ధి కావద్దన్నది వారి కుట్రగా జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు.

మా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చామని, అలాగే పలు జాబ్ నోటిఫికేషన్స్ తో నిరుద్యోగులకు ఉద్యోగ సౌకర్యం కల్పించిన ఘనత మా పార్టీకే దక్కుతుందన్నారు. త్వరలోనే మహిళలకు నెలకు రూ. 2500 లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు, అలాగే పెన్షన్ కూడా పెంచే నిర్ణయాన్ని ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Omnichannel strategy boosts fashion company. New business ideas. Zimbabwe to require whatsapp group admins to register and appoint data protection officers biznesnetwork.