అక్కినేని హీరోలతో నటించిన ఏకైక హీరోయిన్

Akkineni Nagarjuna

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య తాజా చిత్రం “తండేల్” కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచేసింది. ఈ సినిమా అనేక కారణాలతో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుంది, ఎందుకంటే అక్కినేని హీరోలతో నటించిన ఏకైక హీరోయిన్ సాయి పల్లవి మాత్రమే. నాగార్జున, చైతన్య, అఖిల్ సినిమాల్లో ఆమె ప్రత్యేకంగా కనిపించింది.టాలీవుడ్ లో అక్కినేని కుటుంబం ప్రత్యేకమైన స్థానం పొందింది.

అక్కినేని నాగార్జున తన కుటుంబాన్ని సినీ రంగంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నాడు. దివంగత నాగేశ్వరరావు తరవాత నాగార్జున హీరోగా ఆరంభించిన సినీ ప్రయాణం ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. 80, 90’ లలో నాగార్జునకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ సమయంలో ఆయనకు మహిళా అభిమానులు అధిక సంఖ్యలో ఉండేవారు. టాలీవుడ్ లో ‘మన్మథుడు’ ట్యాగ్ కూడా ఆయనకే సొంతం. చాలా కాలంగా సరైన హిట్ కోసం ప్రయత్నిస్తున్న నాగార్జున, ఈ మధ్యకాలంలో కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

ఆయన తర్వాత, తనయులు నాగచైతన్య, అఖిల్ కూడా అక్కినేని వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం, అఖిల్ తన కొత్త సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మరొకవైపు, నాగచైతన్య “తండేల్” చిత్రంలో చందూ మొండేటీ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాయి. “లవ్ స్టోరీ” చిత్రం తర్వాత, సాయి పల్లవి, చైతన్య కలిసి నటించడమంటే అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Life und business coaching in wien – tobias judmaier, msc. : 200 – 400 dkk pr. Does the import and export business make enough profit ? biznesnetwork.