సోషల్ మీడియా లో సినీ తారలకు సంబంధించిన ప్రతీ విశేషం చిటపటలాడుతూ పాపులర్ అవుతోంది. త్రోబ్యాక్ ఫోటోలు, పర్సనల్ విశేషాలు, రీల్స్, అయితే, తాజా ఫోటోతో బుల్లితెర హాట్ బ్యూటీ ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇన్నాళ్లు గ్లామర్ ఫోజులతో ఆకట్టుకున్న ఆమె ఇప్పుడు బామ్మ గెటప్ లో కనిపించడంతో నెటిజన్లు షాకవుతున్నారు. మీకు తెలియని ఈ బామ్మ ఎవరో కాదు, అందరికీ తెలిసిన బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి. అషూ రెడ్డి టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులను సంపాదించుకుని, ఆ పాపులారిటీతో బిగ్ బాస్ ఆఫర్ అందుకుంది. ఈ రియాల్టీ షోలో పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
ఆ తర్వాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది. నిత్యం సోషల్ మీడియా లో యాక్టివ్‌గా ఉంటూ, హాట్ ఫోటోషూట్లతో అలరించే ఈ బ్యూటీ, ఇప్పుడు బామ్మా గెటప్ ఫోటో షేర్ చేయడంతో ఫ్యాన్స్ కి ఇది పెద్ద షాక్ గా మారింది.అషూ రెడ్డి ప్రస్తుతం పలు టీవీ షోలలో యాంకర్ గా మారి బిజీగా గడుపుతోంది. ఆమె ఇటీవలే “ఫ్యామిలీ స్టార్” అనే షో కోసం బామ్మ గెటప్ వేసిందట. ఈ గెటప్ లో ఆమెని చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అదనంగా, ఆమె తన సంపాదనలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇస్తూ అనాథ పిల్లల చదువులో తోడ్పాటుగా నిలుస్తోంది.