ఈనెల 21, 22న హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

President Draupadi Murmu will visit Hyderabad on 21st and 22nd of this month

హైదరాబాద్‌: ఈ నెల 21,22 తేదీల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదారాబాద్ లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి అందుకు సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఉత్తర్వులు సైతం జారీ చేశారు. ద్రౌపది ముర్ము నగరంలో పర్యటన ఉన్నందున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమె పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ముర్ము బస చేయనుండగా.. ఆ రూట్లలో ట్రాఫిక్ నిబంధనలు, కంట్రోల్, పోలీస్ బందోబస్తుపై డీజీపీతో పాటు పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రెండ్రోజుల పర్యటనలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదని అందుకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేసి చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.

కాగా, ఈ నెల 21వ తేదీ గురువారం సాయంత్రం రాష్ట్రపతి హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచీ నేరుగా ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవానికి హాజరవుతారు. 22వ తేదీ శుక్రవారం హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో జరిగే లోక్ మంతన్ 2024 ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

J alexander martin home j alexander martin. Txt pro biz geek. With businesses increasingly moving online, digital marketing services are in high demand.