ఇళ్ల కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Supreme Court Says Properti

ఉత్తర్ ప్రదేశ్‌ లో బుల్డోజర్ల తో ఇళ్ల కూల్చివేత పై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు ఇచ్చింది. నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని న్యాయ విచారణ లేకుండానే నిందితులుగా పరిగణించి, వారి ఇళ్లను కూల్చివేయడం సరికాదని స్పష్టం చేసింది. అలా చేయడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తామని తెలిపింది. నిందితుడి నివాసాన్ని కూల్చడం అధికార దుర్వినియోగమేనని, ఇది చట్టవిరుద్ధమని ధర్మాసనం పేర్కొంది.

సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టు.. వ్యక్తి నిజంగా దోషిగా నిర్దారించబడితే చట్ట ప్రకారం శిక్ష ఉంటుంది కానీ బుల్డోజర్ ద్వారా న్యాయం చేయడం సరికాదు. ఈ తీర్పు ద్వారా రాజ్యాంగబద్ధతకు తూట్లు పొడవడం లాంటి చర్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ధర్మాసనం దేశవ్యాప్తంగా ఇళ్ల కూల్చివేతలపై మార్గదర్శకాలను త్వరలో విడుదల చేస్తామని తెలియజేసింది. ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం తీర్పును వెల్లడించింది.

‘ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలనేది ఒక కల… ఎగ్జిక్యూటివ్‌ను ఆశ్రయం తీసుకోవడానికి అనుమతించాలా అనేది కోర్టు ముందున్న ముఖ్యమైన ప్రశ్న’ అని జస్టిస్ గవాయ్ అన్నారు. ‘ప్రజాస్వామ్య ప్రభుత్వానికి చట్టబద్ధమైన పాలన పునాది… ఈ సమస్య నేర న్యాయ వ్యవస్థలో న్యాయానికి సంబంధించింది.. చట్టపరమైన ప్రక్రియ పూర్తికాకుండా నిందితుల నేరాన్ని ముందస్తుగా నిర్ధారించకూడదు’ అని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

But іѕ іt juѕt an асt ?. Coaching methodik life und business coaching in wien tobias judmaier, msc. Latest sport news.