న్యూఢిల్లీ: సన్యాసులు రాజకీయాల్లోంచి తప్పుకోవాలని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ చీఫ్ మల్లిఖర్జున వ్యాఖ్యనించారు. అయితే ఈ వ్యాఖ్యలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘బాటేంగేతో కాటేంగే’ అంటే మీకు కోపం వస్తోంది కదా? దాన్ని నాపై కాదు హైదరాబాద్ నిజాంపై చూపించండి. రజకార్లు మీ ఊరిని తగలబెట్టారు. హిందువుల్ని దారుణంగా చంపారు. మీ తల్లిని, చెల్లిని,మీ కుటుంబీకుల్ని దారుణంగా చంపేశారు. (కులాలుగా)విడిపోతే జరిగే నష్టమిదే. ఓటు బ్యాంకు కోసం దాన్ని మీరు మర్చిపోయినట్టు ఉన్నారు’ అంటూ యోగి కౌంటర్ ఇచ్చారు.
గతంలో హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలనలో హిందువులపై జరిగిన దాడుల్లు మల్లికార్జున ఖర్గే తల్లి సహా కుటుంబ సభ్యులు మొత్తం చనిపోయిన విషయాన్ని యోగి గుర్తు చేశారు. ఇప్పుడు ఓట్ల కోసమే ఆయన తన కుటుంబం చేసిన త్యాగాన్ని మర్చిపోయారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇంకపోతే..భారతీయులంతా కులాల వారీగా, మతాల వారీగా విడిపోతే దేశం ముక్కలు అవుతుందని తప్పా జాతి అభివృద్ధి సాధ్యం కాదని పలువురు సీనియర్ పొలిటికల్ నేతలు సైతం హెచ్చరిస్తున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. అమరావతిలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్.. మల్లికార్జున ఖర్గే లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే చిన్నతనంలో జరిగిన ఓ విషాద సంఘటనను గుర్తు చేశారు. మన దేశంలో బ్రిటీష్ పాలన కొనసాగుతున్న సమయంలో హైదరాబాద్ సంస్థానం నిజాం రాజుల పాలనలో ఉండేది. అయితే ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న మల్లికార్జున ఖర్గే పూర్వీకుల గ్రామం.. హైదరాబాద్ సంస్థానంలోనే నిజాం రాజుల ఆధీనంలో ఉండేది. నిజాం పాలకుల సమయంలో హిందువులే లక్ష్యంగా తీవ్రమైన దాడులు జరిగేవని గుర్తు చేశారు. అప్పుడు జరిగిన అగ్ని ప్రమాదంలో మల్లికార్జున ఖర్గే ఇల్లు పూర్తిగా కాలిపోయిందని పేర్కొన్న యోగి.. ఆ ఘటనలో ఖర్గే తల్లి సహా కుటుంబ సభ్యులంతా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.