పార్టీని వీడే ప్రసక్తి లేదని ప్రకటించిన వైసీపీ ఎమ్మెల్సీ

Pandula Ravindra Babu

అసెంబ్లీ ఎన్నికల ముందు నుండి వైసీపీ కీలక నేతలు పార్టీని వీడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత రాజీనామాల పర్వం ఎక్కువైంది. మాజీ మంత్రులు , మాజీ ఎమ్మెల్యేలు , కీలక నేతలు ఇలా చాలామంది వైసీపీ బై బై చెప్పి టిడిపి , జనసేన లో చేరుతూ వచ్చారు. కిలారు రోశయ్య, మద్దాలి గిరి, సిద్దా రాఘవరావు, మాజీ మంత్రి ఆళ్ల నాని , బాలినేని, సామినేని ఉదయభాను వంటి నేతలు వైసీపీకి రాజీనామా చేశారు. ముగ్గురు ఎమ్మెల్సీలు, ముగ్గురు రాజ్యసభ సభ్యులు సైతం వైసీపీకి గుడ్ బై చెప్పేశారు.

వీరిలో జగన్‌కు అత్యంత నమ్మకస్తులు కూడా ఉన్నారు. ఆళ్ల నాని , బాలినేని వంటి వారు జగన్‌కు ఆప్తులు. వీరికి జగన్ మంత్రి పదవులు కేటాయించారు. వీరు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. బీద మస్తార్ రావు, మోపిదేవి వెంకట రమణ, ఆర్‌ కృష్ణయ్య వంటి రాజ్యసభ సభ్యులు తమ పదవులతో పాటు పార్టీకి కూడా రాజీనామా చేశారు . ఈ క్రమంలో తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు కూడా పార్టీని వీడుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం అవ్వడం మొదలైంది.

అయితే ఈ వార్తలపై ఎమ్మెల్సీ రవీంద్రబాబు స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇదంతా తప్పుడు ప్రచారం అని తెలిపారు. ప్రజలు ఈ వార్తలను నమ్మవద్దు అని సూచించారు. ఈ క్రమంలో ‘నాకు వైసీపీని వీడాల్సిన అవసరం లేదు’ అని ఎమ్మెల్సీ రవీంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంలో జగన్‌తోనే నా ప్రయాణం అని ఆయన తేల్చి చెప్పారు. దేశంలో ఎవరూ చేయని విధంగా మాజీ సీఎం జగన్ తన పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

He had nо іntеrеѕt іn the еxіѕtіng rulеѕ оf thе gаmе. Latest sport news. Horse chestnut archives brilliant hub.