మహేష్-రాజమౌళి సినిమాకు హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా

SS Rajamouli Mahesh Babu

టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న బ్లాక్‌బస్టర్. ఈ సినిమా పట్ల ఉన్న అంచనాలు ఇప్పటికే కాశాన్నంటున్నాయి. పాన్-వరల్డ్ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమా ద్వారా రాజమౌళి మహేష్ బాబును ఒక అందరూ ఊహించని కొత్త లుక్‌లో చూపించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో తాజా గాసిప్స్ ప్రకారం, ఈ సినిమా పూర్తిస్థాయి అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతుందని చెబుతున్నారు. దీనిలో మహేష్ బాబు కొత్త అంగ్లంలో కనిపించనున్నాడట. అంతేకాకుండా, ఈ సినిమాలో హీరోయిన్‌గా హాలీవుడ్ నటి నయోమీ స్కాట్‌ను ఎంపిక చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు సమాచారం. అలాద్‌దిన్, చార్లీ’స్ ఏంజెల్స్ వంటి అంతర్జాతీయ హిట్ చిత్రాల్లో నటించిన నయోమీ, ఈ సినిమాలో నటిస్తే, గ్లోబల్ ఆడియెన్స్‌ను మరింత ఆకర్షించడంలో ఇది కీలక పాత్ర పోషించనుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. నయోమీ స్కాట్ నటించబోతున్నారన్న వార్త ఇంకా అధికారికంగా ధృవీకరించబడాల్సి ఉన్నప్పటికీ, ఈ క్రాస్‌ఓవర్ గాసిప్స్ టాలీవుడ్‌లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. హాలీవుడ్-టాలీవుడ్ కలయిక గనుక నిజమైతే, భారతీయ చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్లే ప్రాజెక్ట్‌గా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

భారీ బడ్జెట్‌తో రూపొందించబోతున్న ఈ చిత్రానికి చిత్రబృందం అన్ని వైపులా అందరూ ఆశించిన స్థాయిలోనే గ్రాండ్ నిర్మించేందుకు కృషి చేస్తోంది.మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో మరో ఘన విజయాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Latest sport news. Mushroom ki sabji : 5 delicious indian mushroom recipes brilliant hub.