అమరావతి: ఏపీ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ 2024-25ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ కాపీస్‌లోని పద్దులను చదివి వినిపిస్తున్నారు. అంతకుముందు ఆయన గత ప్రభుత్వ తప్పిదాలపై విమర్శలు చేశారు.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉన్నదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సి ఉంది. గత ప్రభుత్వ పాలనను ప్రజలు పాతరేశారు. 93శాతం ప్రజల ఆమోదాన్ని కూటమి ప్రభుత్వం పొందగలిగిందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం రాబోయే 25 ఏళ్ల ఆదాయాన్ని తగ్గించిందని విమర్శించారు.
అలాగే పరిమితికి మించిన అప్పులు చేసి.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆరోపించారు. లోపభూయిష్టమైన విధానాలను అనుసరించి.. అభివృద్ధిని కుంటుపడేలా చేసిందన్నారు. శాశ్వత రాజధాని లేకుండా రాష్ట్ర విభజన జరిగిందని రాష్ట్రాన్ని పునర్మిర్మాణ దిశగా నడిపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుందని, గత ప్రభుత్వం నీటి పారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించిందని గత ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లలేదన్నారు. కాగా, నీటి పారుదల, సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్‌ను ఆర్థిక శాఖ రూపొందించినట్లు స్పష్టం అవుతుంది.
బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం అంచనా రూ. 2,35,916.99 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ. 32,712.84 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు రూ. 34,743.38 కోట్లు, ద్రవ్య లోటు రూ. 68,742.65 కోట్లుగా పయ్యావుల తన బడ్జెట్ ప్రసంగం ద్వారా వెల్లడించారు. బడ్జెట్‌లో వివిధ కీలక రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు.ఏపీ 2024 – 25 వార్షిక బడ్జెట్ రూ. 2.94 లక్షల కోట్లు.
ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నాలుగు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్.
.రెవెన్యూ వ్యయం అంచనా రూ. 2.34లక్షల కోట్లు.
.మూలధనం వ్యయం అంచనా రూ. 32,712 కోట్లు.
.రెవెన్యూ లోటు రూ. 34,743 కోట్లు.
.ద్రవ్య లోటు రూ. 68,743 కోట్లు.
.జీఎస్డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19శాతం.
.జీఎస్డీపీలో ద్రవ్యలోటు అంచనా 2.12 శాతం.
.వ్యవసాయ బడ్జెట్ రూ. 43,402.33 కోట్లు.
.వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 11,885 కోట్లు.
.ఉన్నత విద్యకు రూ. 2,326 కోట్లు కేటాయింపు.
.ఆరోగ్య రంగానికి రూ. 18,421 కోట్లు కేటాయింపు.
.పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 16,739 కోట్లు కేటాయింపు.
.పట్టణాభివృద్ధికి రూ.11,490 కోట్లు కేటాయింపు.
.గృహ నిర్మాణ రంగానికి రూ. 4,012 కోట్లు కేటాయింపు.
.జలవనరులు రూ. 16,705 కోట్లు.
.పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127 కోట్లు.
.ఇంధన రంగానికి రూ. 8,207 కోట్లు.
.ఎస్సీ కాంపొనెంట్ కు రూ. 18,497 కో్ట్లు.
.ఎస్టీ కాంపోనెంట్ కు రూ. 7,557 కోట్లు.
.బీసీ కాంపొనెంట్ కు రూ. 39,007 కోట్లు.
.అత్యల్ప వర్గాల సంక్షేమానికి రూ. 4,376 కోట్లు.
.ఉచిత సిలిండర్ పంపిణీకి రూ. 895 కోట్లు.
.మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం రూ. 4,285 కోట్లు.
.నైపుణ్యాభివృద్ధికి రూ. 1,215 కోట్లు.
.పాఠశాల విద్యకు రూ. 29,090 కోట్లు
.ఉన్నత విద్యకు రూ. 2,326 కోట్లు.