సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం

Justice Sanjiv Khanna sworn in as CJI

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాఈరోజు( సోమవారం) ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని మోడీ, కేంద్ర న్యాయశాఖమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సహా తదితరులు హాజరయ్యారు. సీజేఐగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. దీంతో తదుపరి సీజేఐగా సంజీవ్‌ ఖన్నా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్‌, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ తదితరులు హాజరయ్యారు. కాగా, భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ఆరు నెలలు మాత్రమే ఉంటారు. ఆయన 2025 మే 13న పదవీ విరమణ చేస్తారు.

కాగా, ఢిల్లీలో 1960, మే 14న జన్మించిన సంజీవ్‌ ఖన్నా ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన క్యాంపస్‌ లా సెంటర్‌లో న్యాయశాస్ర్తాన్ని చదివారు. ఢిల్లీ హైకోర్టులో 2005లో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2006లో శాశ్వత జడ్జి అయ్యారు. 2019, జనవరి 18న సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన పలు ప్రముఖ తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఎన్నికల బాండ్లను రద్దు చేయడం, ఈవీఎంలు విశ్వసనీయమైనవని ప్రకటించడం, 370 అధికరణ రద్దును సమర్థించడం, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడం లాంటి కీలక తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో జస్టిస్‌ ఖన్నా భాగస్వామిగా ఉన్నారు.

రెండేండ్ల పాటు సీజీఐగా పనిచేసిన జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పదవీ కాలం ఆదివారంతో ముగిసింది. అయోధ్య జన్మభూమి వివాదం, ఆర్టికల్‌ 370 రద్దు, స్వలింగ సంపర్కాన్ని నేరరహితం చేయడం వంటి తీర్పులలో భాగస్వామి కావడమే కాక, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 38 రాజ్యాంగ ధర్మాసనాలలో ప్రాతినిధ్యం వహించారు. సుప్రీంకోర్టులో 500కు పైగా తీర్పులు ఇచ్చారు. ఒక్క తీర్పులలోనే కాక, న్యాయ విభాగంలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టి తనదైన ముద్ర వేశారు. ఇప్పటివరకు కళ్లకు గంతలతో ఉన్న న్యాయదేవత స్థానంలో ఒక చేతిలో త్రాసు, మరో చేతిలో రాజ్యాంగం చేతబట్టిన కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇరువురు జస్టిస్‌లే న్యాయవ్యవస్థలో తనదైన ముద్ర వేసారు. జస్టిస్ ఖన్నా తన నిర్ణయాల్లో న్యాయవ్యవస్థ యొక్క సమగ్రతను, దయానిబద్ధతను ముందుకు తీసుకెళ్లారు, అలాగే జస్టిస్ చంద్రచూడ్ పౌర హక్కులు, న్యాయపరమైన సమానత్వాన్ని సమర్థంగా రక్షించేందుకు పలు సూచనలు చేశారు.భవిష్యత్తులో సుప్రీం కోర్టు జడ్జి పదవుల్లో ఇంకా చాలా సంస్కరణలు, చర్చలు మరింత అభివృద్ధి చెందబోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. జస్టిస్ చంద్రచూడ్, సుప్రీం కోర్టులో న్యాయ ప్రక్రియల తేలికైన అవగాహన కోసం సాంకేతికతను ఉపయోగించారు. కోర్టు బృందం ప్రతిసారీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కేసులను పరిశీలించడం ప్రారంభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Deputy principal construction manager. The future of fast food advertising. Consultants often travel to meet clients or work on site, offering plenty of opportunities to explore new places.