మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతిదేవి కన్నుమూత

Komireddy Jyoti Devi

మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతిదేవి గారి మృతి పట్ల రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర సంతాపం వ్యక్తమవుతోంది. ఇటీవల అనారోగ్యంతో బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో చేరిన ఆమె, చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. జ్యోతిదేవి గారు 1998లో మెట్‌పల్లి ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆమె సుమారు 17 నెలల పాటు మెట్పల్లి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా సేవలందించారు. జ్యోతి దేవి మృతితో మెట్‌పల్లి పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తూ, ఆమె సమాజానికి అందించిన సేవలను స్మరించుకున్నారు.

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి దేవి మరణం పట్ల పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంతాపం ప్రకటించారు. మలేషియా పర్యటన కోసం బయలుదేరిన మహేష్ కుమార్ గౌడ్, ఎయిర్ పోర్టు నుంచి జ్యోతి దేవి కుమారుడు కోమిరెడ్డి కరం గారిని ఫోన్ చేసి, ఆమె మరణవార్తను తెలుసుకున్నారు. ఆయన అనంతరం జ్యోతి దేవి కుటుంబానికి తన సానుభూతిని వ్యక్తం చేసి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. న్యాయ విద్యనభ్యసించిన (LLB) చదివిన జ్యోతిదేవిని మెట్‌పల్లి ప్రాంత ప్రజలు ప్రేమగా జ్యోతక్క అని పిలుస్తారు. జ్యోతిదేవి భర్త రాములు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చింది. 1994లో తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మెట్‌పల్లి మండలం వెంకట్రావుపేట ఎంపీటీసీగా విజయం సాధించారు. అనంతరం ఎంపీపీగా మండల ప్రజలకు సేవలందించారు.

మెట్‌పల్లి ఎమ్మెల్యేగా ఉన్న చెన్నమనేని విద్యాసాగర్‌రావు 1998లో ఎంపీగా విజయం సాధించగా.. అక్కడ ఉపఎన్నిక నివార్యమైంది. అప్పటికే ఎంపీపీగా కొనసాగుతున్న జ్యోతిదేవి ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీశారు. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డిపై విజయం సాధించారు. సుమారు ఏడాదిన్నర కాలం పాటు ఆమె ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఢిల్లీలో ఆందోళనలు చేసి ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ దృష్టిలో పడ్డారు. దీంతో జ్యోతిదేవిని ఆలిండియా మహిళా ఎమ్మెల్యేల అసోసియేషన్‌ నాయకురాలిగా సోనియా నియమించారు. చట్టసభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌తో ఆమె అనేక ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇక 2004 ఎన్నిక‌ల్లో ఆమె భ‌ర్త కొమొరెడ్డి రాములు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. జ్యోతిదేవి రాములు దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. గతేడాది ఏప్రిల్‌లో జ్యోతిదేవి భర్త, మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి రాములు సైతం మృతి చెందారు. అనారోగ్య కారణాలతో ఆయన తనువు చాలించారు. రాములు మెట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నా 2004లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించింది. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన కొమొరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Inventors j alexander martin. Retention of your personal data. Tips for choosing the perfect secret santa gift.