సీఎం రేవంత్ రెడ్డి కి బర్త్ డే విషెస్ తెలిపిన పవన్ కళ్యాణ్

cm revanth bday

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు , ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు, ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డికి దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. “తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు” అని ఆయన పేర్కొన్నారు.

అలాగే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, రేవంత్ రెడ్డికి మంచి ఆరోగ్యం, తెలంగాణను మరింత సుభిక్షంగా నడిపించే శక్తిని ఇవ్వాలని దేవుడిని ప్రార్థించారు. అలాగే బీజేపీ నేత ఖుష్బూ కూడా రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనకు దేవుడు ఆనందం, ఆరోగ్యం, విజయాన్ని అందించాలని అభిలషించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు, విపక్ష నాయకులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్‌లో ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులతో కలిసి సంబరాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు కేక్‌లు కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. జగిత్యాల జిల్లాలోని ఇందిరా భవన్‌లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, జీవన్‌రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని కేరింతలు కొట్టారు.

జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రజా జీవితం యువతకు ఆదర్శమని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. రైతులకు రుణమాఫీ, గృహ జ్యోతి కింద 200 యూనిట్లు ఉచిత విద్యుత్, మహిళలకు 500 రూపాయలకు సిలిండర్, ఉచిత బస్సు సౌకర్యం వంటి పథకాలను అమలు చేసి ప్రజలకు మేలు చేశారని తెలిపారు. నిరుద్యోగుల కోసం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి, నైపుణ్య శిక్షణతో పాటు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించారని గుర్తుచేశారు.

రేవంత్ రెడ్డి 1969 నవంబరు 8న, తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూల్ జిల్లా, వంగూరు మండలం, కొండారెడ్డిపల్లి గ్రామం లో జన్మించాడు. చిన్నప్పటి నుండే రాజకీయాల్లో ఆసక్తితో ఉన్నా ఆర్ట్స్ లో స్నాతకులు. రేవంత్ రెడ్డికి మొత్తం ఏడుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. పెద్దన్న భూపల్ రెడ్డి రిటైర్డ్ ఎస్సై, రెండో అన్న కృష్ణారెడ్డి, మూడో అన్న తిరుపతి రెడ్డి కొడంగల్ కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా పని చేశాడు. నాల్గొవ సోదరుడు జగదీశ్వర్ రెడ్డి యూఎస్‌లో స్ధిరపడ్డాగా మరో ఇద్దరు సోదరులు కొండల్ రెడ్డి, కృష్ఱారెడ్డి హైదరాబాద్‌లో వ్యాపారాలు చేస్తున్నారు. మరో సోదరుడు కొండల్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు కవల సోదరులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

T shirts j alexander martin. A brief history of mcdonald’s and burger king advertising. That’s where health savings accounts (hsas) come into play.