సిటాడెల్ సినిమా హిట్టా ఫట్టా చూద్దామా

citadel

స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది. ఇందులో హీరోగా వరుణ్ ధావన్ కనిపించగా, కేకే మేనన్, సికిందర్ కేర్, షాకీబ్ సలీం, సిమ్రాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌కు రచయితగా సీతా ఆర్. మేనన్ వ్యవహరించగా, రాజ్ అండ్ డీకే డైరెక్షన్‌లో తెరకెక్కింది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి వచ్చిన ఈ సిరీస్ క్రైమ్ థ్రిల్లర్ జనర్లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది.

సమంత హనీ పాత్రలో నటిస్తుండగా, ఆమె తన కూతురు నాడియాతో జీవితాన్ని కొనసాగిస్తోంది. అనుకోని సంఘటనలతో హనీ మీద దాడులు జరగడం, తనను హతమార్చడానికి కొందరు వెంబడించడం మొదలవుతుంది. మరోవైపు, బన్నీ (వరుణ్ ధావన్) తన భార్య హనీ ఇంకా బతికే ఉందని తెలుసుకుని ఆమెను వెతుక్కుంటూ ఇండియాకి వస్తాడు. హనీ వెంబడించే వీరంతా ఎవరు? ఆమె శక్తి, సాహసం ఏవిధంగా బన్నీకి సహకరించాయి గతం, ప్రస్తుతాన్ని అల్లుకునే కథ ఈ సిరీస్‌లో ఉత్కంఠను రేకెత్తిస్తుంది.

కథలో కొత్తదనం లేకపోయినా, రాజ్ అండ్ డీకే కథను తెరపై నడిపిన తీరు ప్రశంసనీయం. రెండు కాలం శకాలను చూపించడంలో సక్సెస్ అయిన రచయితలు 1992, 2000 మధ్య కాలంలలో కధను తారసపరిచారు. మొదటి రెండు ఎపిసోడ్‌లలో కీలక పాత్రలను పరిచయం చేస్తూ, వారి కథాంశాన్ని వివరించడంలో ఎక్కువ సమయం తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఈ సిరీస్ లోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లు హనీ పాత్రలోని సాహసోపేత తత్వాన్ని తేటతెల్లం చేస్తాయి.

సమంత తన హనీ పాత్రలో జీవించి నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరుణ్ ధావన్ బన్నీ పాత్రలో ఆకట్టుకోగా, కేకే మేనన్, సిమ్రాన్ వంటి నటీనటులు తమ పాత్రలలో ఒదిగిపోయారు. సాంకేతికంగా కూడా సిరీస్ అద్భుతంగా ఉంది. స్క్రీన్ ప్లే కట్టిపడేస్తుంది. కెమెరా వర్క్‌ మరియు యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సమంత అభిమానులు ఈ సిరీస్‌ను తప్పక చూడవచ్చు. సిటాడెల్ హనీ బన్నీ ఓ ఎంటర్‌టైనింగ్ వెబ్ సిరీస్‌గా నిలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Posters j alexander martin. रतन टाटा की प्रेरक जीवन कहानी inspiring life story of ratan tata | ratan tata biography. “this move is aimed at protecting the personal data of zimbabweans in an increasingly online world,” said mavetera.