నేడు బెంగళూరుకు వెళ్లనున్న హైడ్రా బృందం

Hydra team going to Bangalore today

హైదరాబాద్‌: హైడ్రా బృందం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు బెంగళూరుకు హైడ్రా బృందం వెళ్లనుంది. ఈ మేరకు రెండు రోజుల పాటు హైడ్రా బెంగళూరులో పర్యటించనుంది. బెంగళూరులో చెరువుల పరిరక్షణ ఎలా ఉంది..అక్కడి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. అనే దానిపై అన్వేషణ హైడ్రా చేయనుంది. ఈ నేపథ్యంలోనే నేడు బెంగళూరుకు హైడ్రా బృందం వెళ్లనుంది.

చెరువుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై క్షేత్రస్థాయిలో హైడ్రా బృందం పరిశీలించనుంది. ఈ మేరకు బెంగళూరుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు..బయల్దేరనున్నారు. కాగా, హైడ్రా మళ్లీ రంగంలోకి దిగుతోంది. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి నిర్మాణాలు చేసిన వారికి నోటీసులు జారీ హైడ్రా చేస్తోంది. కబ్జాను బట్టి వారం నుంచి 15 రోజుల టైం ఇస్తామంటున్నది. ఇప్పటికే సుమారు 60 నోటీసులు జారీ చేసింది హైడ్రా. ఈ నెలాఖరికి కొన్ని అక్రమ నిర్మాణాలను హైడ్రా డిమాలిష్ చేయనుంది. పూర్తిగా కబ్జా అయిన కొన్ని చెరువులకు తిరిగి పునరుజ్జీవనం కల్పిస్తామంటున్న హైడ్రా…. చెరువుల్లోకి వచ్చే వ్యర్ధాలను ఆపడానికి పిసిబి తో కలిసి పని చేయనుంది. చెరువుల స్థితిగతులు తెలుసుకోవడానికి వచ్చే వారం నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ తో MOU చేసుకోనుంది హైడ్రా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Donec eu libero sit amet quam. The future of fast food advertising. Understanding gross revenue :.