జేడీ వాన్స్‌ దంపతులను ఏపీకి ఆహ్వానిస్తాం: సీఎం చంద్రబాబు

JD Vance will be invited to AP.CM Chandrababu

అమరావతి: అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న జేడీ వాన్స్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. తెలుగు మూలాలున్న ఉషా వాన్స్ చరిత్ర సృష్టించారని మెచ్చుకున్నారు. ‘ప్రపంచంలోని తెలుగువారందరికీ ఇది గర్వకారణం. వారిని ఏపీకి ఆహ్వానించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా’ అని తెలిపారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్‌కు కూడా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు.

కాగా, అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్ పార్టీ విజ‌య‌ఢంకా మోగించింది. దీంతో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి యూఎస్ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు వివిధ దేశాధినేత‌ల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కులు, సెల‌బ్రిటీలు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు కూడా ట్రంప్‌కు అభినంద‌నలు తెలిపారు. ఈ క్రమంలోనే యూఎస్‌ ఉపాధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న జేడీ వాన్స్‌కు చంద్ర‌బాబు ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్) వేదిక‌గా అభినంద‌న‌లు తెలిపారు. ఆయ‌న భార్య తెలుగు మూలాలు ఉన్న ఉషా వాన్స్ చ‌రిత్ర సృష్టించార‌ని చంద్ర‌బాబు మెచ్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Review and adjust your retirement plan regularly—at least once a year. Passos cruciais para prevenir recaídas na dependência química na clínica de recuperação para dependentes químicos. 禁!.