ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

mechanic rocky

టాలీవుడ్ యువ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. ఈ చిత్రం పేరును మెకానిక్ రాకీ గా ఖరారు చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. విశ్వక్ సేన్ సరసన హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటిస్తున్న ఈ చిత్రం, ప్రేక్షకులలో భారీ అంచనాలను సృష్టిస్తోంది.

తాజాగా, చిత్ర బృందం ఐ హ్యాట్ మై డాడీ అనే సాంగ్‌ను విడుదల చేసినట్లు ప్రకటించింది. జాక్స్ బిజోయ్ సంగీతం అందించిన ఈ పాటకు సనారే లిరిక్స్ అందించగా, రామ్ మిర్యాల ఈ పాటకు స్వరాలు అందించారు. ఈ సాంగ్ ద్వారా సినిమా మరింత ఆసక్తిని పెంచుకుంది. ఈ పాట విడుదలకు ముందుగా చిత్ర బృందం, సినిమా నుండి కొన్ని ప్రత్యేక పోస్టర్లను సోషల్ మీడియాలో విడుదల చేసింది. మెకానిక్ రాకీ చిత్రాన్ని నవంబర్ 22, 2024న భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని ఎస్ఆర్టి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మించగా, ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్ఎల్పి ద్వారా దేశవ్యాప్తంగా విడుదల చేయబడుతుంది. మెకానిక్ రాకీ ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వటానికి, తన ప్రత్యేక కథ, కథనం, పాటలు, మరియు అద్భుతమైన నటనతో మరింత ఆసక్తిని రేకెత్తించడానికి సిద్ధంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Leading consumer products companies j alexander martin. Txt pro biz geek. Consultants often travel to meet clients or work on site, offering plenty of opportunities to explore new places.