జీవా హీరోగా రూపొందిన ‘బ్లాక్’

black movie

తమిళ సినీ పరిశ్రమలో హీరో జీవా ఒకప్పుడు మంచి క్రేజ్‌ను సంపాదించాడు. కానీ కొన్ని సంవత్సరాలుగా ఆయన సినిమాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఆయన సొంత ఏజ్ గ్రూప్ హీరోలతో పోలిస్తే గడచిన కాలంలో రేసులో కొంత వెనుకబడ్డాడని చెప్పాలి. మరోవైపు హీరోయిన్ ప్రియాభవాని శంకర్ మాత్రం వరుసగా అవకాశాలను అందుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తోంది.

ఇలాంటి సమయంలో జీవా, ప్రియాభవాని శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘బ్లాక్’ మంచి అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రం అక్టోబర్ 11న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాని ఎస్.ఆర్. ప్రభు, ప్రకాశ్ బాబు సంయుక్తంగా నిర్మించగా, బాలసుబ్రమణియన్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు, ఈ చిత్రం ఈ నెల 1వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

‘బ్లాక్’ హారర్ టచ్ తో కూడిన సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో సాగుతుంది. కథలో వసంత్, అరణ్య అనే భార్యభర్తలు విహారయాత్ర కోసం బీచ్ వద్ద కొత్తగా కొనుగోలు చేసిన తమ విల్లాలో గడపడానికి వెళతారు. అక్కడ మొత్తం విల్లాలు ఖాళీగా ఉంటాయి, కానీ ఒక ఖాళీ విల్లాలో లైట్లు వెలుగుతుండటం చూసి వారు విచిత్రంగా అనుకుంటారు. ఆ ఇంట్లోకి వెళ్లినప్పుడు, అచ్చం తమలా ఉండే మరో జంటను చూసి భయంతో బయటకు పరుగుతీయడం మొదలు పెడతారు. ఆ తరువాత ఈ జంటపై ఏమి జరుగుతుంది, వారు ఎదుర్కొనే విపరీత అనుభవాలు ఏమిటన్నది ఈ కథ ప్రధానంగా సాగుతుంది. ‘బ్లాక్’ సినిమాలో హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The technical storage or access that is used exclusively for statistical purposes. Hest blå tunge. Review and adjust your retirement plan regularly—at least once a year.