అది ఓ మతతత్వ పార్టీ : కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు

It is a religious party. Konda Surekha key comments

హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖ బీజేపీ పై విమర్శలు గుప్పించారు. విభజించి పాలించే మనస్తత్వం బీజేపీదని.. అది ఓ మతతత్వ పార్టీ కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీ బీజేపీ అని విమర్శించారు. ప్రజల అవసరాల కోసం ప్రజల అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ ఎప్పుడు పాటుపడలేదని ఆరోపించారు. బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ కులంపై ప్రశ్నిస్తున్నారని… ఆ పార్టీ నాయకులు కుల గణన ఫామ్ తీసుకుని రాహుల్ గాంధి ఇంటికి వెళ్తే.. రాహుల్ గాంధీ కులం ఏంటో అడిగితే ఆయనే చెబుతారన్నారు. గత పది సంవత్సరాలలో ప్రజలకు సమస్య చెప్పుకునే వేదిక కూడా ఉండేది కాదని మంత్రి తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పరిపాలన అందిస్తోందన్నారు. ఎన్నికల ముందు ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతామని హామీ ఇచ్చామని.. ప్రగతి ఉన్నచోట ప్రజాపాలన కొనసాగుతోందని చెప్పారు.

తెలంగాణ కొత్త పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ వచ్చాక గాంధీ భవన్‌లో కార్యకర్తల కోసం, ప్రజల కోసం మంత్రుల ముఖాముఖి ఏర్పాటు చేయాలని, కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. గాంధీభవన్‌లో మంత్రితో ముఖాముఖి మంచి సంప్రదాయం ఇది ఎప్పటికీ కొనసాగుతుందన్నారు. కుల గణన అంశంలో ప్రజల్లో సైతం మంచి స్పందన వచ్చిందని.. ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. కుల గణన బ్రిటిష్ కాలంలో జరిగిందని.. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు ఇప్పుడు సర్వే చేపడుతున్నామని స్పష్టం చేశారు.

విశ్వంలో ఎక్కడా లేని విధంగా మన దగ్గరే కుల వివక్ష ఉందని రాహుల్ మాట్లాడారన్నారు. సామాజిక న్యాయం జరగడంలో తెలంగాణ రోల్ మోడల్ గా ఉండాలని తెలిపారు. 25 రోజుల లోపల కుల గణన సంపూర్ణంగా పూర్తి అవుతుందని.. ప్రతి ఇంటిలో ఏ కులం వారు ఎంత ఉన్నారో 56 ప్రశ్నలతో రిపోర్ట్ సిద్ధం చేస్తున్నామన్నారు. కుల గణన పూర్తయిన తర్వాత వాటి రిపోర్టు ఆధారంగా ఏ విధంగా సామాజిక న్యాయం చేయాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు చేసిన అవినీతివాళ్ళ కలలో కనిపిస్తున్నాయి కావచ్చు అందుకే వాటి గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Latest sport news. 画ニュース.