లగ్గం టైమ్‌ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల

laggam time

నిర్మాణ రంగంలో కొత్త ప్రయోగాలను ముందుకు తీసుకువస్తూ టాలీవుడ్‌లో వరుసగా పలు కొత్త నిర్మాణ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ కోవలోనే తాజాగా లాంచ్ అయిన సంస్థ సెంచరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తాజాగా తమ మొదటి చిత్రాన్ని ప్రకటించింది. తొలి సినిమాకు ‘లగ్గం టైమ్‌’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంలో రాజేష్ మేరు, నవ్య చిత్యాల లీడ్ రోల్స్ లో నటిస్తుండగా, నెల్లూరు సుధర్శన్, ప్రీతి సుందర్, ప్రణీత్ రెడ్డిలాంటి కళాకారులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమాకు ప్రజోత్ కె వెన్నం కథ అందిస్తూ, దర్శకత్వం వహిస్తున్నాడు. కె. హిమ బిందు నిర్మాణ బాధ్యతలు తీసుకోగా, పవన్ గుంటుకు సినిమాటోగ్రఫీ, సంగీతానికి తోడ్పాటు అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ రైట్స్‌ను ప్రముఖ సంస్థ ఆదిత్య మీడియా సొంతం చేసుకుంది. ‘లగ్గం టైమ్‌’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయడం ద్వారా సినిమా పై ఆసక్తిని పెంచిన చిత్ర బృందం, ప్రముఖ దర్శకుడు సాగర్ కె చంద్ర చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. “బీమ్లా నాయక్‌” వంటి విజయవంతమైన చిత్రంతో పేరు తెచ్చుకున్న సాగర్ కె చంద్ర, ఈ చిత్ర బృందానికి తన అభినందనలు తెలుపుతూ, సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆకాంక్షించారు.

ఈ సినిమా కథ వివాహం చుట్టూ తిరుగుతుందని, కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసే ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. కొత్త కథా సరళి, కొత్త నటీనటులతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుందని చిత్ర బృందం నమ్మకాన్ని వ్యక్తం చేసింది.
కథ, దర్శకత్వం ప్రజోత్ కె వెన్నం నిర్మాత: కె. హిమ బిందు
నటీనటులు; రాజేష్ మేరు, నవ్య చిట్యాల, నెల్లూరు సుదర్శన్, ప్రీతి సుందర్, ప్రణీత్ రెడ్డి
సినిమాటోగ్రఫీ మరియు సంగీతం: పవన్ గుంటుకు
పిఆరోవో & డిజిటల్: మమత రెడ్డి, ఫణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Life und business coaching in wien – tobias judmaier, msc. Hest blå tunge. As a small business owner, grasping the nuances of financial terms is crucial for informed decision making.