వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఈ మేరకు అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకొనున్నారు. ఆయన అమెరికా అధ్యక్షుడు కావడం ఇది రెండోసారి. ఈ ఎన్నికల్లో ట్రంప్ ఇప్పటికే 277 సీట్లలో విజయం సాధించారు. అధ్యక్షుడు కావడానికి మ్యాజిక్ ఫిగర్ 270 కాగా ఆయన 7 స్థానాల ఎక్కువగానే గెలుచుకున్నారు. ఇక డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 266 సీట్లతో సరిపెట్టుకున్నారు.
ఇంకా 35 చోట్ల కౌటింగ్ కొనసాగుతోంది. ట్రంప్ గెలుపుతో రిపబ్లికన్లు సంబురాలు చేసుకుంటున్నారు. ట్రంప్ ప్రచారం, ఆయనపై జరిగిన హత్యాయత్నంతో ఆయనకు మద్దతు పెరిగింది. అంతే కాదు డిబెట్ లో పై చేయి సాధించడంతో ఆయన ముందుకు దూసుకెళ్లాడు. అయితే డెమోక్రటిక్ పార్టీ తమ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ తప్పించి కమలా హారిస్ కు అవకాశం ఇచ్చింది. దీంతో ట్రంప్ కు కాస్త ఆధిక్యం తగ్గింది. హారిస్, ట్రంప్ హోరాహోరీగా ప్రచారం చేశారు. ముందుస్తు సర్వేల్లో
కమలా హారిస్ ముందు ఉండగా.. చివరి సర్వే ట్రంప్ ఆధిక్యంలోకి దూసుకొచ్చాడు. ట్రంప్ ప్రచారాన్ని హారిస్ గట్టిన తిప్పికొట్టినా.. ప్రజలు ట్రంప్ వైపే మొగ్గు చూపారు. ముఖ్యంగా యువ ఓటర్లంతా రిపబ్లికన్ పార్టీ వైపే వెళ్లారు. దీంతో ట్రంప్ విజయం ఖాయమైంది. కీలకమైన స్వింగ్ రాష్ట్రాలైన జార్జియా, పెన్సిల్వేనియాలను కైవసం చేసుకున్న తర్వాత ట్రంప్ విజయం దాదాపు ఖరారు అయింది. ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికలలో 538 ఎలక్టోరల్ ఓట్లలో 304 గెలుచుకున్నప్పటికీ ప్రజాదరణ పొందిన ఓట్లను గెలుచుకోవడంలో విఫలమయ్యారు.
రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్‌కు విజయ ప్రసంగంలో ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్ తన ప్రసంగాన్ని మధ్యలోనే వదిలేసి భార్య చెంపపై ముద్దుపెట్టుకున్నాడు. “దేవుడు నా ప్రాణాన్ని ఒక కారణంతో తప్పించాడు” అని ట్రంప్ చెప్పారు. డోనాల్డ్ ట్రంప్ తన “విక్టరీ స్పీచ్”లో ఒక హత్యాయత్నాన్ని గుర్తుచేసుకుంటూ “దేవుడు ఒక కారణం కోసం నా ప్రాణాలను విడిచిపెట్టాడు” అని పేర్కొన్నాడు.