సీతారాములుగా రణ్బీర్ సాయి పల్లవి రిలీజ్ డేట్ అనౌన్స్

ramayana

బాలీవుడ్ స్టార్ దర్శకుడు నితేష్ తివారీ రామాయణ ఇతిహాసాన్ని సినిమాగా తెరపైకి తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. భారతీయ ప్రేక్షకులు ఈ సినిమాకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. రామాయణాన్ని కథనంలో సజీవంగా ప్రతిబింబించేందుకు నితేష్ తివారీ గట్టి కృషి చేస్తున్నాడు. ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటించనున్నారు. లంకేశ్వరుడు రావణుడి పాత్రలో ఫేమ్ యష్ నటించనున్నాడు.

తాజాగా, ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల చేయాలని డైరెక్టర్ నితేష్ తివారీ ప్రకటించారు. మన రామాయణం, మన సంస్కృతి మరియు చరిత్రను ప్రపంచంతో పంచుకోవాలని కలతో, ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం,” అని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం అత్యుత్తమ సాంకేతిక పరికరాలను ఉపయోగించాలని ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం.

ముఖ్యంగా, ఈ చిత్రానికి వీఎఫ్ఎక్స్ (విజువల్ ఎఫెక్ట్స్) కోస్మొ ఆస్కార్ విన్నింగ్ సంస్థ డీఎన్‌ఈజీ తో చర్చలు జరపటం, అలాగే తెలుగు వెర్షన్‌కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ రాయడం చిత్రానికి ప్రత్యేక ఏర్పడుతుంది. సంగీతంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ తో పాటుగా మరికొన్ని టాలెంట్‌లను తీసుకునే అవకాశం ఉన్నట్టు వినికిడి. ప్రస్తుతం, ఈ భారీ ప్రాజెక్టుకు బాలీవుడ్ ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా మరియు అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మాతలుగా పని చేస్తున్నారు. ఇప్పటికే రామాయణ అనేది భారతీయ చరిత్రలో అత్యంత గౌరవప్రదమైన ఇతిహాసం, దీనిని తెరపై చూపించబోయే ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎంతటి విజయం సాధిస్తుందో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whаt wіll іt tаkе tо turn the tіdе ?. Retirement from test cricket. Frontend archives brilliant hub.