ఏపీలో మెగా డీఎస్సీ 2024 వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం.. ఈ రోజు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల ఇది వాయిదా పడింది. టెట్ ఫలితాలు ప్రకటించిన తర్వాత, మెగా డీఎస్సీ ప్రకటన చేయాలనీ అనుకున్నారు. కానీ ఈ ప్రకటనకు సంబంధించి వాయిదా పడింది.
ఈ వాయిదా వెనుక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మార్పీఎస్ ఈ సమస్యపై విమర్శలు చేస్తున్నది. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకముందు ఎలాంటి నియామకాలు ప్రకటించకూడదని అందుకే వాయిదా వేసినట్లు తెలుస్తుంది.
ఈ మొత్తం మెగా డీఎస్సీలో 16,347 పోస్టులు ఉంటాయని, ఇందులో ఎస్జీటీ (6371 పోస్టులు), స్కూల్ అసిస్టెంట్లు (7725 పోస్టులు), టీజీటీ (1781 పోస్టులు), పీజీటీ (286 పోస్టులు), ప్రిన్సిపల్ (52 పోస్టులు), పీఈటీ (132 పోస్టులు) ఉన్నాయి. ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు మూడు రోజులలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయబోతారని వినికిడి.