లండన్ వేదికగా ఎక్సెల్ హాల్స్‌లో జరుగుతున్న 44వ వరల్డ్ ట్రావెల్ మార్ట్ లో తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ ప్రత్యేక స్టాల్‌ను ప్రారంభించారు. ఇందులో తెలంగాణ పర్యాటక ప్రదేశాలు మరియు చారిత్రక ప్రాంతాల ఫొటోలు డిజిటల్ స్క్రీన్లలో ప్రదర్శించబడ్డాయి.
ప్రదర్శనను యూకే (UK) భారత హై కమిషనర్ విక్రమ్ దురై, కేంద్ర పర్యాటక శాఖ డీజీ ముగ్ధ సిన్హా, గోవా పర్యాటక శాఖ మంత్రి రోహన్ ఖంటే, ఒడిషా డిప్యూటీ సీఎం ప్రవతి ఫరీదా తదితరులు హాజరయ్యారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి కోసం ముఖ్యంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం.. హైదరాబాద్‌లో కొత్త పర్యాటక ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం వంటి అంశాలపై చర్చ జరిగింది. పర్యాటక రంగంలో తెలంగాణ ప్రత్యేక గుర్తింపును ప్రపంచానికి పరిచయం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.