పుష్ప-2 మరోసారి సినిమాను వాయిదా వేశారు

alluarjun

సినీ ప్రేమికులంతా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పుష్ప-2 చిత్రాన్ని ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప మొదటి భాగం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటనకు, అతని స్టైల్‌కు ఉత్తర భారత ఆడియన్స్ పెద్ద అభిమానులు అయ్యారు. అల్లు అర్జున్ తన అద్భుతమైన నటనతో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా గెలుచుకుని తెలుగు సినిమా చరిత్రలో తొలి జాతీయ అవార్డు గెలుచుకున్న హీరోగా నిలిచారు.

పుష్ప మొదటి భాగం ఉత్తరాదిలో 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం వల్ల పుష్ప-2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ సీక్వెల్ కోసం ఉత్తరాది ప్రేక్షకులు మరింత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ కూడా ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని సమాచారం. దాదాపు 90% షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. అసలుగా ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయాలని భావించినప్పటికీ, షూటింగ్ ఆలస్యం కారణంగా డిసెంబర్ 6కు వాయిదా వేశారు.

తాజాగా నిర్మాతలు మరోసారి విడుదల తేదీని మార్చి, డిసెంబర్ 5న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసిన అల్లు అర్జున్, వేడుకలు ఒకరోజు ముందుగానే ప్రారంభమవుతాయి. బాక్సాఫీస్ వద్ద పుష్ప రాజ్ పాలన మొదలవుతుంది అంటూ ట్విట్టర్ వేదికగా చెప్పారు. ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ గన్ పట్టుకుని స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులకు ఆసక్తి పెంచాడు.

అంతేకాక, పుష్ప-2 లో ప్రత్యేక ఆకర్షణగా ఐటం సాంగ్ ఉంటుందని, ఈ పాట కోసం బాలీవుడ్ స్టార్ శ్రద్ధా కపూర్‌ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సాంగ్ కోసం శ్రద్ధా కపూర్ భారీ రెమ్యూనరేషన్‌ అయిన రూ.4 కోట్లను డిమాండ్ చేసినట్టు వినిపిస్తోంది. త్వరలోనే ఈ పాట షూటింగ్ ప్రారంభం నుందని సమాచారం.
ఈ వార్తలతో ‘పుష్ప-2’పై అంచనాలు మరింత పెరిగాయి, బాక్సాఫీస్‌పై ఈ సినిమా ప్రభంజనం సృష్టించబోతుందనే అభిప్రాయంలో అభిమానులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Deputy principal construction manager. New business ideas. Truecaller appoints ogochukwu onwuzurike as country manager for nigeria biznesnetwork.