ఇందిరాపార్క్ కు ఆటోలో ప్రయాణించిన కేటీఆర్‌

KTR traveled by auto to Indira Park

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఆటలో ప్రయాణించారు. ఈరోజు ఉదయం నుండి హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్ల మహా ధర్నా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కేటీఆర్ మొదట నందినగర్‌లోని తన నివాసం నుంచి కారులో బయలుదేరారు. ఆ తర్వాత కొందరు సీనియర్ నాయకులతో కలిసి ఆటో ఎక్కిన కేటీఆర్ మహాధర్నా వద్దకు చేరుకున్నారు. ఆటో డ్రైవర్‌తో కేటీఆర్ కాసేపు ముచ్చటించారు. ఆయన ఆటోలో కూర్చొని వెళుతుండగా కొంతమంది కార్యకర్తలు, అభిమానులు ఆయనతో సెల్ఫీ తీసుకోవడానికి పోటీపడ్డారు.

కాగా, ఉచిత బస్సు పథకం కారణంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్లు మహాధర్నా నిర్వహిస్తున్నారు. ఆటో, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నారు. మహాలక్ష్మి స్కీంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనిని వెంటనే అమలు చేయాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆటో, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. యాప్‌లతో అనుమతి లేకుండా నడుస్తున్న టూ వీలర్లను నిషేధించాలని కోరుతున్నారు. ప్రమాద బీమాను రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 2లక్షల మంది ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. మహాలక్ష్మీ స్కీమ్ కు ముందు యావరేజ్ గా రూ.1000 సంపాదన ఉంటే.. ఇప్పుడు రూ.500 కూడా సరిగ్గా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏడాదికి రూ.12వేలు ఇస్తామని హామి ఇచ్చింది. కానీ అది అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆటో, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Consolidated bank ghana achieves record gh¢1 billion revenue in q3 2024. Estratégias de sucesso para prevenir recaídas na clínica de recuperação para dependentes químicos. 『映画 すみっコぐらし とびだす絵本とひみつのコ』大“ひっと”御礼舞台挨拶付き上映会が12月1日、東京・有楽町の丸の内ピカデリー・シアター1で行われ、すみっコたち(ぺんぎん?、しろくま、とかげ、ねこ、とんかつ)とまんきゅう監督が登壇しました.