హైదరాబాద్: నేడు నాంపల్లి క్రిమినల్ కోర్టుకు ఏఐసీసీ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షి హాజరయ్యారు. బీజేపీ నేత ప్రభాకర్ చేసిన వ్యాఖ్యల విషయంలో ఆమె పరువునష్టం కేసు వేశారు. ఈ పిటిషన్ పై ఈరోజు నాంపల్లి కోర్టు విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో దీపాదాస్ మున్షి కోర్టుకు హాజరయ్యారు.
ఆమెకు మద్దతుగా కాంగ్రెస్ ఎంపీలు , మాజీ ఎంపీలు కార్యకర్తలు , నాంపల్లి కోర్టుకు వచ్చారు. బీజేపీ నేత ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై దీపాదాస్ మున్షి పరువునష్టం కేసు వేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ నాంపల్లి కోర్టు విచారణ చేస్తోంది. అయితే పలుమార్లు కోర్టుకు బీజేపీ నేత ప్రభాకర్ డుమ్మా కొట్టారు. ప్రభాకర్ చేసిన ఆరోపణలకు ఆధారాలతో కోర్టుకు ఈరోజు హాజరవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో నాంపల్లి కోర్టులో బీజేపీ నేత ప్రభాకర్ హాజరయ్యారు. అయితే ఈకేసును డిసెంబర్ 5వ తేదీకి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది.
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తనపై చేసిన అవినీతి ఆరోపణలపై ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ నాంపల్లి కోర్టు ను ఆశ్రయించారు. తాను ‘క్విడ్ ప్రో కో’కు పాల్పడ్డానంటూ గతంలో ప్రభాకర్ చేసిన ఆరోపణలపై దీపాదాస్ మున్షీ పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల కోసం పలువురు నేతలు ఆమెకు బెంజ్ కార్లు గిఫ్ట్‌గా ఇచ్చారంటూ ప్రభాకర్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.