రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా కోసం అభిమానులు గత మూడు సంవత్సరాలుగా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం పట్ల ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడగా, ఇటీవల మూవీ యూనిట్ వరుస అప్డేట్స్‌తో ప్రేక్షకుల ఉత్సాహాన్ని మరింత పెంచింది.
ఇప్పటికే గేమ్ ఛేంజర్ నుంచి రెండు పాటలు మరియు పలు పోస్టర్లు విడుదల కాగా, త్వరలో టీజర్ కూడా రాబోతోంది. నవంబర్ 9న టీజర్ విడుదల చేస్తామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించడంతో, మెగా ఫ్యాన్స్ మరింత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ముందుగానే ప్రకటించారు.
టీజర్ లాంచ్ ఈవెంట్ కూడా నవంబర్ 9న భారీ స్థాయిలో జరపాలని చిత్రబృందం ప్రణాళికలు వేసినట్టు సమాచారం. ఈ పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్నందున, దేశవ్యాప్తంగా విస్తృత ప్రమోషన్లు నిర్వహించనున్నారు. టీజర్ లాంచ్ ఈవెంట్ చెన్నైలో నిర్వహించాలని చిత్రయూనిట్ నిర్ణయించగా, దిల్ రాజు, దర్శకుడు శంకర్, హీరో రామ్ చరణ్, ఇతర ప్రముఖ నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తోంది చెన్నై నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రమోషన్ టూర్ ఆపై మరిన్ని రాష్ట్రాల్లో కొనసాగుతుందని భావిస్తున్నారు. రామ్ చరణ్ అభిమానులు ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, అక్కడ రామ్ చరణ్ సినిమా గురించి పలు విషయాలను పంచుకునే అవకాశం ఉండవచ్చు.