కెనడా ఆల‌యంలో హిందువులపై దాడి పై పవన్ రియాక్షన్

Deputy CM Pawan visit to Dwaraka Tirumala today

కెనడాలోని బ్రాంప్టన్‌ హిందూ ఆలయంపై ఖలిస్థానీ మద్దతుదారులు చేసిన దాడి పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనను పలు ప్రముఖులు, ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఖండించారు.

పవన్ కల్యాణ్ “ఎక్స్” (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో హిందువులపై జరుగుతున్న వేధింపులు, హింస పై విచారం వ్యక్తం చేశారు. “హిందువులు ప్రపంచవ్యాప్తంగా మైనారిటీలుగా ఉంటున్నారు. అందుకే వారు చాలా సులభంగా టార్గెట్ అవుతున్నారు. వీరి పై దాడులు కూడా అంతే సులభంగా జరుగుతుంటాయి” అని ఆయన పేర్కొన్నారు.

కెనడాలో హిందూ ఆలయంపై జరిగిన దాడి గురించి మాట్లాడుతూ.. ఇది తీవ్ర విషాదం కలిగించే ఘటన అని అభిప్రాయపడ్డారు. “కెనడా ప్రభుత్వం అక్కడ హిందూ సమాజానికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటుందని నేను ఆశిస్తున్నాను” అని అన్నారు. ప్రపంచంలో హిందువులపై జరుగుతున్న హింస, హిందువులపై వివిధ దేశాల్లో జరుగుతున్న హింసాసంభవాలను ఆయన తప్పుబట్టారు, అయితే ప్రపంచ నాయకులు, అంతర్జాతీయ సంస్థలు, శాంతిని కోరుకునే ఎన్‌జీఓల నుండి మాత్రం స్పందన లేకపోవడాన్ని సుదీర్ఘ మౌనంగా అభివర్ణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Finding opportunity in a saturated market : how to thrive in the skincare and beauty industry biznesnetwork. Estratégias de sucesso para prevenir recaídas na clínica de recuperação para dependentes químicos. 広告掲載につ?.