Prasanth varma; ప్రశాంత్ వర్మ తన ఖాతాలో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను సొంతం,

prasanth varma

ఈ ఏడాది టాలీవుడ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ తన ఖాతాలో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘హనుమాన్’ చిత్రం సంక్రాంతి సీజన్‌లో విడుదలై బాక్సాఫీస్‌ను గట్టిగా కదిలించింది. హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. ఈ విజయం వలన ప్రశాంత్ వర్మ సీక్వెల్‌ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నాడు.

ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ‘జై హనుమాన్‌’ అనే పేరుతో సీక్వెల్‌ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కాంతార ఫేమ్‌, కన్నడ స్టార్‌ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించబోతున్నారు. దీపావళి సందర్భంగా విడుదల చేసిన రిషబ్ శెట్టి లుక్‌ అభిమానుల్లో భారీగా అంచనాలు పెంచింది. రీసెంట్‌గా విడుదలైన ‘జై హనుమాన్’ థీమ్ సాంగ్‌ కూడా అభిమానులను ఆకట్టుకుంది.

తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో సంచలనం రేపుతోంది. ఈ ఫోటోలో రిషబ్ శెట్టి, రానా దగ్గుబాటి ఉన్నారు. “జై జై హనుమాన్” అనే క్యాప్షన్‌తో పాటు ప్రశాంత్ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ను ట్యాగ్ చేశాడు. ఇది చూసిన నెటిజన్స్‌లో రానా కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నాడేమో అనే సందేహం మొదలైంది.

ఇప్పటికే రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో హనుమాన్‌గా నటిస్తున్నట్లు తెలియజేసిన ప్రశాంత్ వర్మ, రానా చేరికతో ప్రేక్షకులకు మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రానా కూడా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగమైతే ఆయన పాత్ర పవర్‌ఫుల్‌ రోల్‌గా ఉండబోతుందనే టాక్ నడుస్తోంది. రానా పాత్ర గురించి స్పష్టత రావాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

It reveals how much of the gross revenue translates into actual earnings. Estratégias de sucesso para prevenir recaídas na clínica de recuperação para dependentes químicos. 用規?.