Lucky Baskhar;ఫస్ట్ డేకి మించి కలెక్షన్స్,4వ రోజు ఎన్ని కోట్లంటే

dqlucky baskarthre

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లక్కీ భాస్కర్ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి వీకెండ్‌ని ఘనంగా ముగించింది. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం, తెలుగులో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచినట్లు తెలుస్తోంది. మొదటి మూడు రోజులపాటు భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా, నాలుగో రోజూ అదిరే వసూళ్లతో కొనసాగుతోంది.

ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా నిర్మించారు. దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షీ చౌదరి కథానాయికగా నటించగా, రామ్‌కీ, మానస చౌదరి, హైపర్ ఆది, సచిన్ ఖేడేకర్, సాయి కుమార్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేశారు.

దుల్కర్ సల్మాన్ గత చిత్రాలు, క్లీన్ ఇమేజ్, యువత మరియు కుటుంబ ప్రేక్షకుల్లో ఆయనకున్న ఫాలోయింగ్ దృష్ట్యా లక్కీ భాస్కర్ థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రైట్స్‌ కూడా ఫ్యాన్సీ రేటుకు అమ్ముడయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సుమారు రూ.15 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. సినిమా మొత్తం బడ్జెట్ సుమారు రూ.100 కోట్లుగా చెప్పబడుతోంది.

విశేషంగా బిజినెస్ సాధించిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే సుమారు రూ. 35 కోట్ల షేర్, రూ. 70 కోట్ల గ్రాస్ అవసరమని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం రోజు థియేటర్లలో కుటుంబ ప్రేక్షకులు, యువత ఎక్కువగా పాల్గొనడం వలన మంచి వసూళ్లు నమోదు చేశాయి. నాలుగో రోజు ఈ సినిమా మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ. 11 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం మొదటి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 35 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ విజయవంతమైన రన్‌తో సోమవారం నుండి వర్కింగ్ డేస్‌లో ఈ చిత్రం ఏ రేంజ్‌లో కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

New business ideas. Advantages of local domestic helper. Anklage | johann wolfgang goethe.