కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది: కేటీఆర్‌

Brs working president ktr fire on telangana police

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో సాధ్యం కాని హామీలిచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయిందని కేటీఆర్ మండిపడ్డారు.

వందరోజుల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. 365 రోజులకు 30 రోజులే మిగిలి ఉన్నా ఇంకా హామీలు అమలు చేయలేదని, దీనికి ఢిల్లీ బాబు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేశారు. “వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గారంటీ” అని చెప్పిన మోసగాళ్లకు కౌంట్ డౌన్ స్టార్ట్. మూడు వందల ముప్పై రోజులు ముగిసింది, ఏడాది నిండడానికి 35 రోజులే మిగిలింది!

ఏడాదికి 35 రోజులు మాత్రమే మిగిలింది – 2 లక్షల జాబ్‌లు ఎక్కడ అంటున్నారు నిరుద్యోగులు.

ఏడాదికి 35 రోజులే మిగిలింది – ఎకరాకు రూ.15000 రైతు భరోసా ఏమైంది అంటున్నారు రైతన్నలు..

ఏడాదికి 35 రోజులే మిగిలింది – పెంచిన రూ.4,000 పెన్షన్ ఎక్కడంటున్నారు అవ్వ తాతలు..

ఏడాదికి 35 రోజులే మిగిలింది-నెల నెల ఇస్తామన్న రూ.2500 ఎక్కడబోయాయి అంటున్నారు అడబిడ్డలు..

ఏడాదికి 35 రోజులే మిగిలింది-పెంచి ఇస్తామన్న రూ.6,000 పెన్షన్ ఎక్కడని నిలదీస్తున్నారు దివ్యంగా అన్నలు, అక్కలు..

ఏడాదికి 35 రోజులే మిగిలింది-ఉద్యోగులు మా పీఆర్సీ ఎక్కడ, మా డీఏలు ఎక్కడని సమ్మెలకు సై అంటున్నారు..

ఏడాదికి 35 రోజులే మిగిలింది – కౌలు రైతులు రూ.15000 ఎక్కడ, రైతు కూలీలు రూ.12000 ఎక్కడ అంటున్నారు..

ఏడాదికి 35 రోజులే మిగిలింది – తులం బంగారం ఎక్కడా అంటున్నారు మా బంగారు తల్లులు..

చెప్పిన హామీలన్నీ బూడిదలో పన్నీరయ్యే – చెప్పని మూసీలో లక్షల కోట్ల మూటలాయే.. ఏడాది కాలమంతా అటెన్షన్ డైవర్షన్ తో పబ్బం గడిపిన మూసి సర్కార్ఏ ముంది ఈ ప్రజా పాలనలో గర్వకారణం ధర్నాలు, రాస్తారోకోలు తప్ప? జవాబు చెప్తావా ఢిల్లీ బాబు రాహుల్‌ గాంధీ?’ అంటూ కేటీఆర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Stuart broad truly stands as a force to be reckoned with in the world of test cricket. Mushroom ki sabji : 5 delicious indian mushroom recipes brilliant hub.