ఏపీలో టెట్‌ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్‌

AP Tet Exam Result Released

అమరావతి: విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈరోజు (సోమవారం) ఏపీలో గత నెల 3 నుండి 21 వరకు జరిగిన టెట్‌ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలకు 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది హాజరయ్యారు. డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. అభ్యర్థులు https://cse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. కాగా, త్వరలోనే 16,347 టీచర్‌ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

ఇకపోతే..ఏపీలో యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జూలైలో నిర్వహించిన టెట్ -2024 ఫలితాలను ఈరోజు విడుదల చేస్తున్నాం.. అన్నారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది హాజరు కాగా, అందులో 1,87,256 ( 50.79 శాతం) మంది అర్హత సాధించారు. నిరుద్యోగ టీచర్లకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం. టెట్ లో అర్హత సాధించిన వారందరికీ నా శుభాకాంక్షలు” అని మంత్రి నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు.

మరోవైపు ఏపీలో అక్టోబరు 3 నుంచి 21 వరకు 17 రోజల పాటు టెట్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయా తేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది అభ్యర్థులు హాజరయ్యారు. టెట్ పరీక్షకు సంబంధించి మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 86.28 శాతం మంది పరీక్ష రాశారు. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం నవంబరు 2న టెట్‌ ఫలితాలు విడుదల చేయాల్సి ఉండగా.. తుది ‘కీ’ వెల్లడిలో జాప్యం జరగడంతో ఫలితాల ప్రకటన నవంబరు 4కి వాయిదా పడింది. దీంతో ఇప్పటికే రెస్పాన్స్‌ షీట్లు, ఫైనల్‌ కీ వెల్లడైన విషయం తెలిసిందే. ఉపాధ్యాయ నియామ‌క ప‌రీక్షలో 20% వెయిటేజీ కూడా ఉంది. టెట్‌ స్కోర్‌కు జీవిత కాల గుర్తింపు వర్తిస్తున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gаrmаn асknоwlеdgеѕ thаt hе іѕ аt odds with the board mаjоrіtу. To help you to predict better. Rinse repeat archives brilliant hub.