ఈ రోజు తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల

Tet notification released today in Telangana

హైదరాబాద్‌ : తెలంగాణలో ఈరోజు టెట్‌ పరీక్షకు సంబంధించిన మరోమారు నోటిఫికేషన్ జారీ చేయనుంది. అయితే సంవత్సరానికి టెట్‌ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) రెండుసార్లు నిర్వహిస్తామన్న తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జనవరిలో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. అయితే, ఈ పరీక్షలు సంక్రాంతి లోపా, తర్వాతా? అన్న విషయంలో స్పష్టత లేదు. పరీక్షల కోసం వారం, పది రోజులపాటు స్లాట్లు అవసరం. ఈ నేపథ్యంలో అవి దొరికే సౌలభ్యాన్ని బట్టి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

అయితే మేలో నిర్వహించిన టెట్‌కు 2.35 లక్షల మంది హాజరు కాగా, 1.09 లక్షల మంది పాసయ్యారు. ఇక, టెట్-1 పేపర్‌కు డీఈడీ, పేపర్-2కు బీఈడీ పూర్తిచేసిన వారు అర్హులు. స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి కోసం టెట్ అర్హత ఉండాలని ప్రభుత్వం నిబంధన పెట్టడంతో ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు కూడా పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టెట్ నిర్వహించడం ఇది రెండోసారి.

టెట్-2024కు సంబంధించి మొత్తం 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో అర్హత సాధించిన వారు 67.13% అర్హత నమోదుకాగా.. పేపర్-2లో 34.18 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. టెట్-2023 ఫలితాలతో పోల్చితే పేపర్-1లో 30.24 శాతం, పేపర్-2లో 18.88 శాతం అర్హత పెరగడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Thеrе wаѕ nо immediate response frоm iѕrаеl, whісh hаѕ соnѕіѕtеntlу ассuѕеd thе un of іnѕtіtutіоnаl bіаѕ against іt. To help you to predict better. ©2023 brilliant hub.