కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తీపి కబురు తెలిపిన సీతక్క

sithakka

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఉద్యోగులకు జీతాలు ఆలస్యం కాకుండా, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రతి నెలా ఒకటో తేదీ నాటికి అందేలా కొత్త విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఈ నిర్ణయంతో ఆన్లైన్లో ఏకకాలంలో జీతాలు చెల్లించే సదుపాయం ఉండబోతుంది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫైల్ ఆర్థికశాఖలో పెండింగ్లో ఉంది. ఆర్థికశాఖ నుంచి అనుమతి లభించిన వెంటనే ఈ కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చే అవకాశం ఉంది. తద్వారా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు నిర్దిష్ట సమయానికి అందేలా చేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Guаrdіоlа’ѕ futurе іn fresh dоubt wіth begiristain set tо lеаvе manchester city. Latest sport news. Mushroom ki sabji : 5 delicious indian mushroom recipes brilliant hub.