రాష్ట్ర రెవెన్యూ సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఇల్లెందు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాట్లాడుతూ.. డిసెంబర్ నెలలోపు మిగిలిన వారికి కూడా రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో పాటు అనేక ఉచిత హామీలు ఇవ్వడం తో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ను భారీ మెజార్టీ తో గెలిపించారు.
ఇక అధికారంలోకి రాగానే చెప్పినట్లే హామీలు నెరవేర్చడం మొదలుపెట్టింది. పలు కీలక హామీలు నెరవేర్చిన సర్కార్..మిగిలిన హామీలను కూడా త్వరలోనే నెరవేర్చాలని చూస్తుంది. అయితే రైతు రుణమాఫీ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో హామీ నెరవేర్చలేకపోయింది. పలు కారణాల కారణంగా కొంతమందికి మాత్రం రుణ మాఫీ చేయగా..మరికొంతమందికి మాఫీ చేయలేకపోయింది. దీంతో మాఫీ కానీ రైతులు సర్కార్ పై ఆందోళనకు దిగారు. త్వరగా మాకు కూడా రుణమాఫీ చేయాలనీ కోరుతున్నారు. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి డిసెంబర్ లోపు మిగిలినవారికి కూడా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.