ఇళ్లలో బల్లులు సహజంగా కనిపిస్తాయి. కానీ వీటిని చూసి కొంతమంది తక్షణం పారిపోతారు. కనిపిస్తే చాలు కేకలు వేస్తారు. వీటి వల్ల కొంతమందికి అసౌకర్యంగా అనిపిస్తుంది. అలాగే అవి ఎక్కడి నుంచి అయినా తమ మీద పడతాయేమో అనే ఆందోళన కూడా ఉంటుంది. కానీ ఈ టిప్స్ పాటిస్తే మీ ఇంట్లో బల్లులు అస్సలు కనిపించవని నిపుణులు చెబుతున్నారు.
బల్లులను దూరం చేయడానికి మిరియాల స్ప్రే చాలా సహాయపడుతుంది. నీటిలో నల్ల మిరియాలు కలిపి బల్లులు కనిపించే ప్రదేశంలో స్ప్రే చేయండి. మిరియాల వాసన వాటిని దూరం చేస్తుంది. అలాగే, ఎర్ర మిరప పొడి, హాట్ సాస్, లేదా ఎర్ర మిరప తురుముతో కూడా స్ప్రే చేయవచ్చు.
వెళ్లుల్లి మరియు ఉల్లిపాయల వాసన బల్లులను దూరం చేస్తుంది. కొంత వెల్లుల్లి లేదా ఉల్లిపాయ ముక్కలను ఇంట్లో వివిధ చోట్ల ఉంచండి. లేదా వాటిని నీటిలో కలిపి స్ప్రే బాటిల్‌లో వేసి లిజార్డ్ రిపెల్లెంట్‌గా ఉపయోగించండి.
నెమలి ఈకలు సహజ లిజార్డ్ రిపెల్లెంట్‌గా పనిచేస్తాయి. ఇంట్లో నెమలి ఈకలు ఉంచడం వల్ల లిజార్డ్స్ దూరంగా ఉంటాయి. ఈకల వాసన బల్లులను భయపెడుతుంది. అలాగే అవి ఇంటికి అందాన్ని కూడా అందిస్తాయి.
నాఫ్తలీన్ బాల్స్ బల్లులను దూరం చేయడానికి కూడా ఉపయోగపడతాయి కానీ పిల్లల నుండి దూరంగా ఉంచండి.
గుడ్డు ఖాళీ పెంకులను బల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో ఉంచండి. గుడ్డు పెంకుల్లో అధిక సల్ఫర్ పదార్థాలు ఉంటాయి. వీటివల్ల ఘాటైన వాసన వస్తుంది. బల్లులు ఈ ఘాటైన వాసనను భరించలేకపోతాయి.