స్వచ్ఛత మరియు వ్యక్తిగత పరిశుభ్రత

clean

స్వచ్ఛత మరియు వ్యక్తిగత పరిశుభ్రత మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. శుభ్రంగా ఉండటం వలన బాక్టీరియా, వైరస్లు మరియు పలు రకాల సూక్ష్మజీవులు మన దేహానికి చేరకుండా నివారించవచ్చు. పరిశుభ్రత పాటించటం వలన వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. అలాగే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

ప్రతిరోజూ స్నానం చేయడం, చేతులు కడుక్కోవడం, గోర్లు సరిగ్గా కట్ చేయడం, దంతాల సంరక్షణ వంటి చిన్న చిన్న అలవాట్లు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా భోజనం ముందు మరియు తర్వాత చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం. కడుపు లోపలికి వైరస్లు వెళ్లకుండా ఇది సహాయపడుతుంది. జలుబు, దగ్గు లాంటి వ్యాధులు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా పరిశుభ్రత జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

మన జీవితంలో ప్రతి రోజూ పరిశుభ్రత అలవాట్లు సాధించుకోవడం ద్వారా పలు వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం, నీటిని వేడి చేసి తాగడం. భోజనం చేసేపుడు ఫ్రెష్ మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మన ఆరోగ్యానికి మంచిది. అలాగే ఇంటి చుట్టుపక్కల చెత్త వదిలిపెట్టకుండా, నీరు నిల్వ ఉండే ప్రదేశాలను క్లీన్ చేయడం వల్ల దోమలు వంటివి పెరగకుండా ఉంటుంది. ఇవి పలు వ్యాధులకు కారణం.

ఆరోగ్యకరమైన పరిశుభ్రత అలవాట్లు మన జీవితానికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని తెస్తాయి. ఈ అలవాట్లను మన రోజువారీ జీవితంలో పాటించడం వల్ల ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Deputy principal construction manager. Create a professional website and social media presence. Avoiding these common mistakes can greatly.