గోరంట్ల‌ మాధ‌వ్‌పై పోలీసులకు పిర్యాదు చేసిన వాసిరెడ్డి ప‌ద్మ

vasireddy padma

వైసీపీని వీడిన ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ.. తాజాగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసారు. గోరంట్ల మాధవ్ అత్యాచార బాధితుల పేర్లను బహిర్గతం చేయడం అనైతికమని, బాధితుల గోప్యతను ఉల్లంఘించడం దుర్మార్గమని తెలుపుతూ ఆమె పిర్యాదు చేసింది. విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబుకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె, బాధితుల గౌరవాన్ని కాపాడేందుకు మాధవ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

మహిళల మీద, అత్యాచార బాధితుల పట్ల సోయిలేకుండా ఒక మాజీ ఎంపీ ఈ విధంగా మాట్లాడటం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఈ ఘటనకు గురైన బాధితుల పట్ల ఇంత దుర్మార్గంగా మాట్లాడిన గోరంట్ల మాధవ్ మీద చర్యలు తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ కోరారు.

వాసిరెడ్డి పద్మ విషయానికి వస్తే..ఏపీ రాజకీయ నాయకురాలు, సమాజసేవకురాలు. ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఈమె కీలక భాద్యతలు నిర్వర్తించారు. ఈ పదవిలో ఉన్నప్పుడు, మహిళల హక్కులను రక్షించడానికి, మహిళలపై జరిగే అన్యాయాలను ఎదుర్కొనేందుకు అనేక చర్యలు చేపట్టారు. వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రయాణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)తో ప్రారంభించి, ఆ పార్టీతో పాటు ప్రజల సేవలో పనిచేశారు. ఇటీవల ఆమె వైసీపీని వీడి బయటకు రావడం వార్తల్లో నిలిచింది. వైసీపీని వీడిన తర్వాత ఆమె జగన్ పై ఆ పార్టీ విధానాలపై విమర్శలు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Biznesnetwork – where african business insights brew !. Por fim, o acompanhamento contínuo é uma estratégia essencial para prevenir recaídas. ??.