ఏపీలో నేటి నుండి ‘గుంతల రహిత రోడ్లు’ కార్యక్రమం

Pothole free roads

సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు విజయనగరం జిల్లా గజపతినగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న “గుంతల రహిత రోడ్ల నిర్మాణం” కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని రహదారులను మెరుగుపరచడం, గుంతలు లేని రహదారులను అందుబాటులోకి తీసుకరావడం ఈ కార్యక్రమం ఉద్దేశ్యం.

ప్రభుత్వం రూ.860 కోట్లు ఖర్చుతో ఈ పథకాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రహదారుల వద్ద పక్కనున్న చెట్లను తొలగించడం, తగిన కల్వర్టులు నిర్మించడం ఈ కార్యక్రమంలో భాగం. రహదారుల గణనీయమైన మెరుగుదల కోసం SRM వర్సిటీ మరియు IIT తిరుపతితో ఒప్పందం కుదుర్చుకుని, నూతన సాంకేతికతను వినియోగిస్తూ రోడ్ల మరమ్మతు పనులను వేగవంతం చేయనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 15 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు, దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రహదారులు సురక్షితంగా మారి, ప్రజలకు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Review and adjust your retirement plan regularly—at least once a year. Clínicas de recuperação para dependentes químicos e alcoólatras. Cinemagene編集部.