ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి ఇందులో కొన్ని టీమ్‌లు కీలకమైన స్టార్ ప్లేయర్లను రిటైన్ చేసుకోకపోవడం ఆశ్చర్యకరం ముఖ్యంగా ముంబయి ఇండియన్స్ (ఎంఐ) తన రిటెన్షన్ విషయమై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకు దారితీసింది. ముంబయి ఇండియన్స్ జట్టు రూ.75 కోట్ల పర్స్ వాల్యూలో ఐదుగురు కీలక ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది.
జట్టు ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను అత్యధికంగా రూ.18 కోట్లకు రిటైన్ చేయగా సూర్యకుమార్ యాదవ్ (రూ.16.35 కోట్లు), హార్దిక్ పాండ్యా (రూ.16.35 కోట్లు) మరియు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను (రూ.16.30 కోట్లు) కూడా జట్టులో కొనసాగించారు యువ ప్రతిభ తిలక్ వర్మను రూ.8 కోట్లకు రిటైన్ చేయడం జరిగింది
అయితే బుమ్రా సూర్యకుమార్ హార్దిక్‌లకు ఎక్కువ ధర ఇచ్చి రోహిత్‌ను తక్కువ ధరకు రిటైన్ చేయడంపై అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు దీనిపై రోహిత్ శర్మ స్పందిస్తూ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తాను ఈ స్థానం, వాల్యూ పట్ల సంతృప్తిగా ఉన్నానని తెలిపారు
”నేను రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఈ పొజిషన్ నాకు సరైనదని భావిస్తున్నా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతర ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడంపై నాకు అభిమానం ఉంది ఈ రిటెన్షన్ విషయంలో నేను సంతోషంగా ఉన్నాను గత రెండు మూడు సీజన్లలో మా ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. 2025 సీజన్‌లో మా ఫ్యాన్స్‌కి మెరుగైన ప్రదర్శన అందించాలని ఆతృతగా ఎదురుచూస్తున్నాను మేము ఇప్పటికే ఐదు టైటిల్స్ గెలిచాం రాబోయే సీజన్‌లో మరొకటి సాధించాలని కృతనిశ్చయంతో ఉన్నాము,” అని రోహిత్ వెల్లడించారు.