అమరావతి: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ దోచుకున్న ఆస్తులను కాపాడుకునేందుకు తాపత్రయ పడుతున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఇప్పుడు ఆ పార్టీ పూర్తిగా పడిపోయిన నావగా ఉన్నదని శ్రీనివాసరావు మండిపడ్డారు. మునిగిపోయిన నావలో ఒక్కరి కొద్దీ కూడా ఉండలేరని ఆయన వ్యాఖ్యానించారు. తన నివాసంలో ఆయన మాట్లాడుతూ..వాలంటీర్లు లేకుండా పింఛన్ల పంపిణీ సాధ్యం కాదన్న వైకాపా నేతలు ఇప్పుడు చూస్తున్నారా?అని వ్యాఖ్యానించారు.
ఇకపోతే..”భవిష్యత్తులో అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం అందించాలనే ఆలోచన ఉందని చెప్పారు. అధ్వాన రోడ్ల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం. విశాఖకు మరిన్ని ఐటీ కంపెనీలను తీసుకురావడానికి మంత్రి లోకేశ్ పనిచేస్తున్నారు. నగర అభివృద్ధిపై శనివారం సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రాజెక్ట్ విషయంలో మేము పూర్తిగా కసరత్తు చేస్తున్నాం” అని గంటా శ్రీనివాసరావు తెలిపారు.