కంప్యూటర్లు మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. టెక్నాలజీ పెరుగుతోన్న సమయంలో లాప్‌టాప్‌లు కేవలం ఐటి, సాఫ్ట్‌వేర్ రంగాల్లోనే కాకుండా, అనేక ఇతర రంగాలలో కూడా అవసరమైన పరికరంగా భావించబడుతున్నాయి. “వర్క్ ఫ్రమ్ హోమ్” పద్ధతి విస్తరించడంతో చాలామంది ఉద్యోగులు తమ లాప్‌టాప్‌ను ఒడిలో ఉంచి పనిచేస్తున్నారు.. కానీ దీర్ఘకాలం పాటు ఇలా పని చేయడం శరీరానికి హానికరంగా ఉంటుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
లాప్‌టాప్‌ను ఒడిలో ఉంచడం వల్ల వెన్ను, మెడ వంగి ఉండటంతో నొప్పులు పెరుగుతాయి. అంతేకాక ఇది చర్మకాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కూడా కారణంగా మారవచ్చు. ముఖ్యంగా లాప్‌టాప్‌ల నుండి విడుదల అయ్యే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించగలదు.
అలాగే లాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పని చేసే మహిళలకు సంతానం పొందడంలో సమస్యలు వస్తాయని, గర్భిణీ స్త్రీలకు, గర్భస్థ శిశువులకు హానికరమైన ప్రభావాలు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.
కాబట్టి ల్యాప్టాప్‌ను కుర్చీలో లేదా టేబుల్‌పై ఉంచండి ఇది వేడి ఎక్కువగా కాకుండా కాపాడుతుంది. ప్రతి 30-40 నిమిషాలకు విరామం తీసుకోండి. అనుకూలమైన కుర్చీ లేదా లాప్‌టాప్ షీల్డ్ ఉపయోగించండి. వీటిని పాటించడం ద్వారా ఆరోగ్య సమస్యల్ని నివారించుకోవచ్చు.