Tirumala:ఒక రోజంతా అన్న ప్రసాద వితరణ కోసం రూ. 44 లక్షలు చెల్లిస్తే సరి:

TTD Titirumala

తిరుమల శ్రీవారి కరుణ కోసం ప్రతిరోజూ లక్షలాది భక్తులు భక్తిపూర్వకంగా స్వామి వారి ఆలయానికి తరలివస్తున్నారు స్వామివారికి నైవేద్యాలు కానుకలు సమర్పిస్తూ తమ మొక్కులు తీర్చుకుంటారు కొందరు భక్తులు స్వామివారికి ఇచ్చే భక్తి కానుకలతో పాటు అన్న ప్రసాద విరాళం అందిస్తూ ఇతర భక్తులకు ఆహారం అందించేందుకు సహాయపడతారు అయితే చాలామందికి వీటికి ఎంత విరాళం ఇవ్వాలనే సందేహం కలుగుతుంటుంది అటువంటి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రత్యేకంగా “అన్నప్రసాదం ట్రస్టు” విరాళ పథకాన్ని ప్రవేశపెట్టింది ఇందులో భాగంగా ఒకరోజు అన్నప్రసాదం కోసం పూర్తి ఖర్చును భరించాలంటే రూ.44 లక్షలు విరాళంగా ఇవ్వవచ్చు రోజుకు మూడు పూటలు అన్నప్రసాద వితరణ కోసం విరాళం అందించాలంటే ఈ మొత్తం చెల్లించాలి ఉదయం అల్పాహారం కోసం మాత్రమే రూ.10 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం కూడా రూ.17 లక్షలు విరాళంగా ఇచ్చి ఆ పుణ్యం పొందవచ్చు. అంతేకాకుండా, విరాళం ఇచ్చిన భక్తులకు స్వయంగా అన్న ప్రసాద వడ్డన చేసే అవకాశం కూడా లభిస్తుంది.

ఈ విరాళం అందించిన దాతల పేరు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు దాతలు వారి కోరిక మేరకు ఒకరోజు అన్నప్రసాద వితరణలో పాల్గొనే అవకాశం పొందుతారు ప్రస్తుతం తిరుమలలోని ప్రధానమైన అన్నప్రసాద కేంద్రాలు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, 2, పీఏసీ-4, పీఏసీ-2 వంటి ప్రాంతాలు మరియు తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం శ్రీనివాసం విష్ణు నివాసం కాంప్లెక్స్ రుయా ఆసుపత్రి మెటర్నిటీ ఆసుపత్రి ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి తిరుచానూరులోని అన్నప్రసాద భవనం వంటి ప్రాంతాల్లో భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ అందిస్తున్నారు ఇక తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, 2లోని కంపార్ట్‌మెంట్లు వృద్ధులు దివ్యాంగులు కోసం ప్రత్యేక కాంప్లెక్స్‌లు రూ.300 ప్రత్యేక దర్శన కాంప్లెక్స్ ప్రధాన కల్యాణకట్టలు వంటి ప్రాంతాల్లో టీ, కాఫీ, చంటిపిల్లలకు పాలు కూడా ఉచితంగా అందిస్తున్నారు టీటీడీ అన్నప్రసాద విభాగం తిరుమల-తిరుపతిలో రోజుకు సుమారు 2.5 లక్షల మందికి అన్నప్రసాదం టీ, కాఫీ, పాలను ఉచితంగా అందిస్తూ తన సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

But іѕ іt juѕt an асt ?. Latest sport news. Cinemageneとは.