నేడు ద్వారకా తిరుమలలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన

Deputy CM Pawan visit to Dwaraka Tirumala today

అమరావతి: జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు(శుక్రవారం) ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఐఎస్ జగన్నాథపురంలో శ్రీ లక్ష్మీనరసిహ స్వామిని దర్శించుకోనున్నారు. తర్వాత, టీడీపీ కూటమి హామీల ప్రకారం ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.

కాగా, ఏపీలో 1.55 కోట్ల మందికి దీపం-2 పథకం అమలు చేయబడుతున్నట్లు వెల్లడించారు. ఉచిత గ్యాస్ సిలిండర్లపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కట్టడి చేయాలని మంత్రి నాదెండ్ల సూచించారు. గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న ప్రతీ వ్యక్తి ఈ పథకానికి అర్హులని స్పష్టం చేశారు. దీపం పథకం కింద 24 గంటల్లో సిలిండర్ డెలివరీ అందుతుందని, చెల్లించిన సొమ్ము 48 గంటల్లో ఖాతాలో జమ అవుతుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 1967 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Latest sport news. Mushroom ki sabji : 5 delicious indian mushroom recipes brilliant hub.