ఇక పై ఎన్‌ఆర్‌ఐలను ఎంఆర్‌ఐలుగా పిలుస్తాను: మంత్రి లోకేశ్‌

Henceforth NRIs will be called MRIs: Minister Lokesh

అమరావతి: ఏపీ మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటనలో భాగంగా అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ కార్యకర్తలు, నేతలు, తెలుగు ప్రజలను ఉద్దేశించి మాట్లాడూతూ.. విదేశాల్లో ఉండే భారతీయులను అంతా ఎన్‌ఆర్‌ఐలు అంటారని… ఇకపై వారిని ఎంఆర్‌ఐలుగా పిలుస్తానన్నారు. అయితే ఎన్‌ఆర్‌ఐలను మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ (ఎంఆర్‌ఐలు)గా అభివర్ణించిన లోకేష్, ఉన్నత విద్యను అభ్యసించిన కొందరు అమెరికాకు వచ్చినా, వారి మనసులు ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటాయని అభిప్రాయపడ్డారు. వీరి ఆలోచన శాశ్వతంగా రాష్ట్రం గురించే ఉంటుందని, అవసరమైనప్పుడు సహాయానికి రావడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని చెప్పారు.

2024 ఎన్నికల్లో దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీడీపీ అభిమానులు, కార్యకర్తలు ఏపీలో ఓటు వేయడానికి వచ్చారని, ఇది ఒక గొప్ప విజయమని అన్నారు. 175కి 175 అంటూ కాలర్ ఎగరేసిన వాళ్ల మొహాలు మాడిపోయేలా చేశారన్నారు. టీడీపీ మద్దతు కోసం వ్యక్తిగతంగా పెట్టుబడులు పెట్టి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, వారి మీద కేసులు పెట్టేవాళ్ళు ఉన్నారని గుర్తుచేశారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను పద్ధతిగా అమలు చేస్తున్నామని చెప్పిన లోకేష్, గతంలో వెయ్యి రూపాయల పింఛన్ పెంచడానికి ఐదేళ్లు పడితే..ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తుందన్నారు. ప్రభుత్వం కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసిందని, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించనున్నట్లు తెలిపారు. అభివృద్ధి సంక్షేమాన్ని రెండు చక్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.

ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది, ఇందుకు చంద్రబాబునే కారణం అన్నారు. ఆయన పేరు చెబితే ఎక్కడైనా రెడ్ కార్పెట్ వేస్తారని గుర్తుచేశారు. సత్య నాదెళ్లతో మెయిల్ ద్వారా చర్చించడానికి వచ్చారు. రాష్ట్రం గురించి చర్చించాలన్నారు. టీడీపీకి దాని కార్యకర్తలే శక్తి, దేశంలో మరో పార్టీకి లేని విధంగా టీడీపీకి ప్రత్యేకమైన కార్యకర్తలు ఉన్నారని అన్నారు. గతంలో చేయని తప్పునకు చంద్రబాబును ఎలా బంధించారో చూశామని..ఇప్పుడు తలుచుకున్నా బాధగా ఉంటుందన్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. అదే కొండంత బలం ఇచ్చిందని జగన్‌పై పోరాడే శక్తి వచ్చిందన్నారు.

కాగా, ప్రస్తుతానికి రెడ్‌బుక్‌లో మూడవ చాప్టర్ ప్రారంభిస్తున్నామని, తప్పు చేసిన వారిని దాన్ని వినిపించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. గత ఐదేళ్లు ఇతర రాష్ట్రాలకు పెట్టుబడులు వస్తున్నాయని, మన రాష్ట్రానికి ఎందుకు రాలేదని ఆందోళన చెందానని చెప్పారు. ప్రజలు ఈ విషయం గుర్తించారని, ఈ తీర్పు చాలా ముఖ్యమని తెలిపారు. చంద్రబాబుకు తనకు ఎవరినైనా జైలుకు పంపే సత్తా ఉన్నా, అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం ముఖ్యమని అన్నారు. రాష్ట్రాన్ని సరిదిద్దడానికి పెట్టుబడులు తెచ్చి ఉపాధి కల్పించడం కోసం ప్రభుత్వం పని చేస్తున్నట్లు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 10060 seconds